రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ లేడీ శ్రీరామ్ కాలేజ్ విద్యార్థిని ఐశ్యర్య ఆత్మహత్య... స్పందించిన రాహుల్ గాంధీ ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇంటర్మీడియట్ లో 99 శాతం మార్కులతో ఢిల్లీ లోని శ్రీ రామ్ లేడీస్ కాలేజీ లో సీటు సంపాదించి చదువుకుంటున్న ఐశ్వర్య స్కాలర్షిప్ రాక, హాస్టల్లో ఉండనివ్వకపోవడంతో, ఇంటి దగ్గర చదువుకునే ఆర్థిక వనరులు లేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఐశ్వర్య రాసిన సూసైడ్ నోట్ చూసిన అందరి మనసు కలచివేస్తుంది .

ఢిల్లీ లేడీ శ్రీరాం కాలేజ్ విద్యార్థిని షాద్‌నగర్‌లో ఆత్మహత్య.. లేఖలోకారణాలుఢిల్లీ లేడీ శ్రీరాం కాలేజ్ విద్యార్థిని షాద్‌నగర్‌లో ఆత్మహత్య.. లేఖలోకారణాలు

 ఢిల్లీ లేడీ శ్రీరామ్ కాలేజ్ విద్యార్థిని ఐశ్వర్య సూసైడ్ .. దేశ వ్యాప్తంగా చర్చ

ఢిల్లీ లేడీ శ్రీరామ్ కాలేజ్ విద్యార్థిని ఐశ్వర్య సూసైడ్ .. దేశ వ్యాప్తంగా చర్చ

ఐఏఎస్ సాధించాలని పట్టుదలతో చదువులో రాణిస్తున్న విద్యార్థిని ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు కొనసాగించలేక పోతున్నానని, చదువు లేకుంటే తను బ్రతకలేను అంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. స్కాలర్షిప్ ఇవ్వకపోవడమే ఐశ్వర్య మృతికి కారణమని తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు .కరోనా మహమ్మారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేయడంతో ఐశ్వర్య చదివించడానికి, ఐశ్వర్య సోదరి చదువును మాన్పించారు. అంతేకాదు ఐశ్వర్య చదువు కోసం ఉన్న ఇంటిని కూడా తనఖా పెట్టారు. ఈ పరిస్థితులు డైజస్ట్ చేసుకోలేకపోయిన ఐశ్వర్య సూసైడ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఆత్మహత్య దేశ వ్యాప్త చర్చనీయంశంగా మారింది.

 స్పందించిన రాహుల్ గాంధీ.. తెలుగులో ట్వీట్

స్పందించిన రాహుల్ గాంధీ.. తెలుగులో ట్వీట్

ఒక చదువుల తల్లి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఐశ్వర్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు తెలుగులో ఐశ్వర్య కుటుంబానికి సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా చేసిన నోట్ల రద్దు ,లాక్ డౌన్ ల ద్వారా ప్రభుత్వం లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం ఇదే నిజం అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.

 ఆర్ధిక నిస్సహాయత కారణంగా ప్రాణాలు తీసుకున్న టాప్ స్టూడెంట్

ఆర్ధిక నిస్సహాయత కారణంగా ప్రాణాలు తీసుకున్న టాప్ స్టూడెంట్

దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలలో ఒకటైన ఢిల్లీ లోని లేడీ శ్రీ రామ్ కాలేజీ విద్యార్థిని ఐశ్వర్య ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రజలను, విద్యావేత్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్‌లో విద్యార్థి తన ఆర్థిక నిస్సహాయతను స్పష్టంగా పేర్కొంది. ఆమె చదువుకోవాలనే తన తాపత్రయం అంతా సూసైడ్ నోట్‌లో రాసింది. చదువు లేకుంటే బ్రతకలేను అంది . ఆర్థిక ఇబ్బందుల కారణంగా, ఆమె కలలు చెదిరిపోయాయి. ఆమె ల్యాప్‌టాప్ కూడా కొనుక్కోలేని దయనీయమైన పరిస్థితిలో చివరికి తనువు చాలించింది.

English summary
Congress leader Rahul Gandhi has also responded on Delhi lady sriram college student suicide .Rahul gandhi tweeted in telugu and said his deep condolences to the parents and mentioned due to the demonotization and also forceable lock down destroyed so many families .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X