వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ సంచలన నిర్ణయం: సోనియా వేసిన సీడబ్ల్యూసీ రద్దు, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన శుక్రవారం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. రానున్న పార్టీ ప్లీనరీ కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ స్థానంలో అది పని చేయనుంది. ఇన్నాళ్లు పని చేసిన సిడబ్ల్యూసీని రద్దు చేశారు. సోనియా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఆమె సీడబ్ల్యుసీని ఏర్పాటు చేశారు.

34 మందితో ఈ స్టీరింగ్ కమిటీని ప్రస్తుతానికి ఏర్పాటు చేశారు. ఇందులో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు ఉన్నారు.

Rahul Gandhi revamps Congress, forms panel to replace CWC

సీనియర్ కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్, అంబికా సోనీ, ద్వివేది, అశోక్ గెహ్లాట్, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, ఆస్కార్ ఫెర్నాండేజ్, ఆనంద్ శర్మ, ఏఐసీసీ చీఫ్ స్పోక్స్ పర్సన్ రణ్‌దీప్ సుర్జేవాలా ఉన్నారు.

త్వరలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఉంది. ప్లీనరీకి ముందు రాహుల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మార్చి 5 రెండో దఫా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ లోపే ఈ ప్లీనరీ ఉండే అవకాశముంది.

English summary
Congress president Rahul Gandhi on Friday formed a steering committee that will function instead of the Congress Working Committee for the forthcoming plenary session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X