వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ పాదయాత్ర భారీ సక్సెస్- 191కి పెరిగిన కాంగ్రెస్ స్కోరు-పార్ట్ 2కు సన్నాహాలు ?

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ డోయాత్ర ద్వారా తానేంటో దేశ ప్రజలకు చూపించారు. ఇప్పటివరకూ రాహుల్ అంటే ఉన్న భ్రమల్ని పటాపంచలు చేశారు. దీంతో కాంగ్రెస్ గ్రాఫ్ కూడా భారీగా పెరిగినట్లు ఇండియాటుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో తేలింది.

|
Google Oneindia TeluguNews

దేశంలో నానాటికీ పతనమవుతూ ఒక్కో రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్ ఫలితాలు ఊరట కలిగించాయి. అయితే అంతకు మించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో సాధించే ఎంపీ సీట్ల అంచనాలు కూడా భారీగా పెరిగాయి. దీనంతటికీ కీలకంగా పనిచేసింది రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రే. ఈ యాత్ర ద్వారా రాహుల్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీపై ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేయడంలో గణనీయంగా విజయవంతమయ్యారు.

 రాహుల్ భారత్ జోడో యాత్ర

రాహుల్ భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని, ఆయన తల్లి సోనియా గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిన తీరు సాధారణ జనానికి కూడా నచ్చలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతల్ని దాటుకుంటూ తమ వరకూ చేరుకున్న ఈడీని నిలువరించేందుకు గాంధీ కుటుంబం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని జనం వద్దే తేల్చుకోవాలని నిర్ణయించిన రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడోయాత్రకు సిద్ధమయ్యారు. అనుకున్నట్లే 134 రోజుల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసేశారు. ఈ యాత్రకు ముందు రాహుల్ ను విమర్శించిన వారు ఇప్పుడు అవే విమర్శలు చేసేందుకు సాహసించడం లేదంటే ఆయన ఏం సాధించారన్నది ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

 యాత్ర సక్సెస్ ఇలా..

యాత్ర సక్సెస్ ఇలా..

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాల్లో ఓ సుదీర్ఘమైన పాదయాత్రే కాదు, అంతకు మించి దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను ఏకం చేసిన యాత్ర. ఇందులో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్నో విపక్ష పార్టీల నేతలు, సీఎంలు, మాజీ సీఎంలు, ఎంపీలు, సామాజిక కార్యకర్తలు ఇలా చాలా మంది మద్దతు తెలిపారు. అంతకు మించి రాహుల్ గాంధీపై ఉన్న భ్రమల్ని తొలగించడంలో ఈ యాత్ర ఎంతో సక్సెస్ అయింది. రాహుల్ అంటే ఓ పార్ట్ టైమ్ పొలిటీషియన్, పప్పు అని విమర్శించిన వారికి ఈ యాత్రతో కాంగ్రెస్ రాకుమారుడు తానేంటో గుర్తుచేశాడు. అంతే కాదు భవిష్యత్తులో దేశ ప్రధాని కావడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని నిరూపించుకున్నారు. వ్యక్తిగత అలవాట్ల దగ్గరి నుంచి దేశ భవిష్యత్తు వరకూ రాహుల్ ఈ యాత్రలో అన్నీ ఆవిష్కరించేందుకు ప్రయత్నించారు. దీంతో రఘురామ్ రాజన్ వంటి ఆర్ధిక మేథావి, తమిళనాడులో యాత్ర సాగినంత సేపు కలవని కమల్ హాసన్ వంటి వారు కూడా రాహుల్ కు సంఘీభావం ప్రకటించారు.

 భారీగా పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్

భారీగా పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్


రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కచ్చితంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెంచుతుందని అంతా ఊహించారు. కానీ ఇప్పుడు వారి అంచనాల్ని సైతం తలకిందులు చేస్తూ ప్రస్తుతం ఉన్న 44 సీట్ల నుంచి ఏకంగా 191 సీట్లకు పెంచేసింది. ఇండియా టుడే తాజాగా వెలువరించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో 191 సీట్లు సాధించబోతోందని అంచనావేసింది. అంటే నాలుగు రెట్లు ఎక్కువన్న మాట. తద్వారా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ కు ఏం సాధించి పెట్టారో ఇట్టే అర్ధమవుతుంది. కాంగ్రెస్ ను ఏకతాటిపైకి నడిపించే నేత లేరని భావిస్తున్న తరుణంలో, కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు ముందుకు రాని రాహుల్ గాంధీ.. ఇప్పుడు భారత్ జోడో యాత్రతో ఈ శతాధిక వయస్సున్న పార్టీకి అంతకు మించిన మేలే చేసే పెట్టారు.

త్వరలో భారత్ జోడో యాత్ర పార్ట్ 2 ?

త్వరలో భారత్ జోడో యాత్ర పార్ట్ 2 ?

కన్యాకుమారిలో మొదలుపెట్టిన కశ్మీర్ వరకూ ఏకధాటిగా 134 రోజుల పాటు భారత్ జోడో యాత్ర పార్ట్ 1 నిర్వహించిన రాహుల్ గాంధీ.. త్వరలో పార్ట్ 2 మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నారు. దేశంలో దక్షిణ కొన నుంచి ఉత్తర కొన వరకూ పార్ట్ 1 చేపట్టిన రాహుల్.. ఇప్పుడు తూర్పు కొన అయిన అరుణాచల్ ప్రదేశ్ నుంచి పశ్చిమ కొన అయిన మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ వరకూ పార్ట్ 2 చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్, ఇతర అంశాలపై కాంగ్రెస్ ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల లోపు దీన్ని కూడా పూర్తి చేసి సగర్వంగా ఎన్నికలకు వెళ్లాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడిస్తామని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.

English summary
congress party's seats score has improved drastrically according to recent india today mood of the nation survey. rahul gandhi's bharat jodo yatra has become crucial in that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X