వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ తన భారత్ పర్యటనలో పంజాబ్‌కు వెళ్లాలి: రాహుల్ చురక

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ భారత పర్యటనకు వచ్చినప్పుడు పంజాబ్ రాష్ట్రంలో పర్యటించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాహుల్ గాంధీ పంజాబ్‌లో పర్యటించి, రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన బుధవారం లోకసభలో ప్రధాని, ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ఇది మీ ప్రభుత్వమో లేక మా ప్రభుత్వమో కాదని, రైతులు, కూలీల ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

Rahul Gandhi's fresh jibe at PM Modi, says PM on India visit, should visit Punjab too

మోడీని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. ప్రస్తుతం ప్రధాని మోడీ భారత పర్యటనలో ఉన్నారని, కాబట్టి ఆయన ఇప్పుడు పంజాబ్‌లో పర్యటించి, రైతుల సమస్యలు తెలుసుకోవాలన్నారు. రైతుల బాధలు తెలుసుకోవాలన్నారు.

ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా అంటూ చెబుతోందని, రైతులు మేకిన్ ఇండియాలో లేరా అని ప్రశ్నించారు. రైతులు ఆహారం పండించడం ద్వారా మేకిన్ ఇండియాలో భాగస్వాములు కావడం లేదా అని ప్రశ్నించారు. మేకిన్ ఇండియా అని ఊదరగొడుతున్నప్పటికీ.. రైతు కంటే ఎక్కువగా ఎవరు అందులో భాగస్వాములు కాలేరని చెప్పారు.

English summary
After returning from meeting with rain-hit Punjab farmers, Congress vice president Rahul Gandhi on Wednesday attacked the Narendra Modi-led government in the Lok Sabha and called it as 'anti-farmer'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X