వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యో .. రాహుల్, బంగ్లా ఖాళీ చెయాలని నోటీసులు ...

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ కొలువుదీరిన నేపథ్యంలో ఢిల్లీలో మాజీ ఎంపీలు తమ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటరీ జాబితా రూపొందించింది. అయితే ఇందులో రాహుల్ గాంధీ ఉంటున్న బంగ్లా కూడా ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 12 తుగ్లక్ రోడ్‌లో గల బంగ్లాలో రాహుల్ ఉంటున్నారు. 2004 నుంచి అమేథి నియోజకవర్గం నుంచి గెలిచినప్పటి నుంచి ఆ బంగ్లాలో ఉంటున్నారు. కానీ చిత్రంగా జాబితాలో రాహుల్ పేరుండటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తుగ్లక్ లేన్ పేరు కూడా ..
ఇటీవల కొత్తగా గెలిచిన ఎంపీలకు వసతి కల్పించేందుకు లోక్‌సభ సెక్రటరీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే పాత ఎంపీలు తమ బంగ్లాలను ఖాళీ చేయాలని నోటీసులు జారీచేసింది. అయితే ఇందులో రాహుల్ ఉంటున్న 12 తుగ్లక్ లేన్ కూడా ఉండటం ఆసక్తి రేపుతుంది. వాస్తవానికి రాహుల్ రెండు చోట్ల నుంచి పోటీచేశారు. అమేథి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ వాయనాడు నుంచి మెజార్టీ ఓట్లతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు 2004 నుంచి అమేథీ నుంచి రాహుల్ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. అప్పటినుంచి తుగ్లక్ రోడ్‌లో గల బంగ్లాను తన కార్యాలయంగా మార్చుకున్నారు రాహుల్. కానీ లోక్ సభ సెక్రటరీ నోటీసుల్లో రాహుల్ బంగ్లాను చేర్చడం కాస్త వింతగా అనిపిస్తోంది.

Rahul Gandhi’s official bungalow included in the Lok Sabha list of vacant houses

మరో చోట కేటాయింపు ?
తుగ్లక్ రోడ్‌లో గల బంగ్లాలు టైప్ 8 క్యాటగిరీగా విజభించబడ్డాయి. ఇక్కడ ప్రముఖులను ఇళ్లను కేటాయిస్తారు. రాహుల్‌తోపాటు ముఖ్యనేతలకు గతంలో కూడా బంగ్లాలు కేటాయించిన సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుంది. 517 మంది సభ్యులకు ఈసారి కొత్తగా వసతి కల్పిస్తారు. అయితే అందులో రాహుల్ పేరు కూడా ఉంది. దీనినిబట్టి రాహుల్ బంగ్లాను మార్చినట్టు అర్థమవుతుంది. అమేథి నుంచి వాయనాడు నియోజకవర్గం మారినట్టు తుగ్లక్ రోడ్ నుంచి మరోచోటికి రాహుల్‌కు వసతి కల్పించనున్నారు.

English summary
As the former MPs of Lok Sabha who were not re-elected vacate their government allotted bungalows in Delhi and newly elected MPs wait for accommodation, the Lok Sabha secretariat has published a list of vacant bungalows. And surprisingly, this list includes 12, Tughlaq Lane, the official residence of Congress president Rahul Gandhi who has been re-elected to the lower house from Wayanad in Kerala, according to a report by ANI. Rahul Gandhi is occupying the residence since he was allotted the same after he became a member of Lok Sabha from Amethi in 2004.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X