వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ విమానంలో సాంకేతిక లోపం: అత్యవసర ల్యాండింగ్, మోడీ ఫోన్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ నుంచి కర్ణాటకలోని హుబ్లీకి గురువారం ఆయన ప్రయాణించిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. అయితే ల్యాండింగ్ కూడా సవ్యంగా కాలేదు.

ఈ నేపథ్యంలో కర్ణాటక పోలీసులకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా ఈ ఘటన జరిగిందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు విమాన పైలట్లను విచారించారు. ఈ సందర్భంగా కర్ణాటక పోలీస్ చీఫ్ నీల్ మణి ఎ. రాజు మాట్లాడుతూ.. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని చెప్పారు.

 Rahul Gandhis plane develops technical snag, Congress says intentional tampering possible

ఈ ఫిర్యాదు విషయమై పౌరవిమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కు పోలీసులు తెలియజేయనున్నట్టు తెలుస్తోంది. రాహుల్ సహాయకుడు కౌశల్ విద్యార్థి విమాన ఘటనపై డీజీసీఏకు ఓ లేఖ రాశారు. దీంతో డీజీసీఏ వివరణ ఇచ్చింది.

Recommended Video

కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది

ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయని, పైలట్ చాకచక్యంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారని తెలిపింది. కాగా, ఈ ఘటన నేపథ్యంలో రాహుల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మధ్యాహ్నం ఫోన్ చేసి ఆయన క్షేమ సమాచారాల గురించి ఆరా తీశారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

'రాహుల్‌కు మోడీ ఫోన్‌ చేసి ఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఎటువంటి ప్రమాదం జరగలేదు.. అయినా ప్రస్తుతం రాహుల్‌ ఆరోగ్య పరిస్థతి గురించి మోడీ ఆరా తీశారు. ఈ ఘటనను ప్రభుత్వం తేలికగా తీసుకోవడం లేదని మోడీ చెప్పారు' అని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

English summary
Congress today suspected that a plane carrying its chief Rahul Gandhi was intentionally tampered and demanded an investigation into the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X