వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆదర్శ్ స్కామ్ నివేదిక తిరస్కరణ తప్పు: రాహుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rahul Gandhi
హైదరాబాద్: కొత్త లోక్‌పాల్ చట్టానికి అనుగుణంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో వచ్చే ఫిబ్రవరి నుంచి కొత్త లోకాయుక్తను అమలు చేస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిపై పోరాటం రాష్ట్రాల స్థాయిలో జరగాలని, అందుకు లోకాయుక్తలను తెస్తామని ఆయన చెప్పారు.

దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. అధిక ధరలపై చర్యలు తీసుకుంటామని, ధరలు తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులకు సూచించామని ఆయన అన్నారు. మహారాష్ట్ర ఆదర్స్ కుంభకోణం కేసులో ఎవ్వరినీ రక్షించాలని తన ఉద్దేశం కావని రాహుల్ గాంధీ తెలిపారు. ఆదర్శ్ కుంభకోణంపై నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడం సరైంది కాదని ఆయన అన్నారు.

చిత్తశుద్ధితో అవినీతికికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే పార్లమెంట్‌లో అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ముందు వాటిని ఆమోదించాలని ప్రతిపక్షాలకు రాహుల్ గాంధీ సూచించారు. అన్ని పార్టీలు కూడా అవినీతి నిర్మూలన గురించి మాట్లాడుతున్నాయి గానీ ఆచరణలో చూపించడం లేదని ఆయన అన్నారు. అవినీతిపై పోరాటానికి యంత్రాంగం కావాలని, అందుకే పార్లమెంటులో లోక్‌పాల్ బిల్లు పెట్టామని ఆయన అన్నారు.

జనవరి 15 నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మార్కెట్ కమిటీల నుంచి కూరగాయల ధరలను మినహాయించాలని రాహుల్ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీనాటికి రాష్ట్రాలు లోకాయుక్త బిల్లును రూపొందిస్తాయని అజయ్ మాకెన్ చెప్పారు.

English summary
vice-president Rahul Gandhi today asserted that the Congress is "dead serious about fighting corruption" and that while he hears other parties "talking and talking and talking" of graft, the Congress alone has been pushing for a series of new laws that would help check venality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X