• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వ్యాక్సిన్లు ఉచితమైతే ప్రైవేటుకు రూ.150 ఎందుకు?: రాహుల్ ప్రశ్న -ఆలస్యం ఖరీదు లక్షల ప్రాణాలన్న మమత

|

దేశంలో కరోనా విలయం కొనసాగుతుండగా, వ్యాక్సిన్ల పంపిణీలో ఏర్పడిన గందరగోళంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, రాష్ట్రాల డిమాండ్‌ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయించే బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని ప్రకటించారు. ఈనెల 21వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో, రాష్ట్రాలకు ఖర్చు లేకుండానే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా కేంద్రీకృతంగా సాగుతుందని చెప్పారు. అయితే ఈ ప్రకటనపై విపక్షాలు భిన్నంగా స్పందించాయి..

  PM Modi: Free Vaccination To All From June 21 | COVID 19 | 3rd Wave | Oneindia Telugu

  కంపెనీలు ఉత్పత్తి చేసే వ్యాక్సిన్‌లో 75 శాతం కేంద్రమే సేకరించి ఉచితంగా అందిస్తుందని, మిగిలిన 25 శాతాన్ని ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్నామని, డబ్బులు చెల్లించగలిగే వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక డోసుకు గరిష్ఠంగా రూ.150 మాత్రమే ధర నిర్ణయించామని ప్రధాని మోదీ చెప్పడం వివాదాస్పదమైంది. మోదీకి నాదొక సూటి ప్రశ్న అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇలా అడిగారు..

  జగన్‌కు ఎన్డీఏ షాక్?: రఘురామకు బిహార్ సీఎం మద్దతు! -ఫోన్ బెదిరింపులపై ఏపీ సీఐడీ కీలక వివరణజగన్‌కు ఎన్డీఏ షాక్?: రఘురామకు బిహార్ సీఎం మద్దతు! -ఫోన్ బెదిరింపులపై ఏపీ సీఐడీ కీలక వివరణ

  rahul-gandhi-simple-question-on-pm-modi-covid-address-delayed-decision-says-mamata

  ''దేశంలో ప్రతి ఒక్కరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తుందని ప్రధాని మోదీ సెలవిచ్చారు. మరి అలాంటప్పుడు ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా డోసులకు ధరను నిర్ణయించడం ఎందుకు?'' అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాష్ట్రాలకు ఖర్చులేకుండా కేంద్రమే ప్రజలందరికీ టీకాలు ఇస్తానని చెప్పడం, మళ్లీ అదే నోటితో ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలకు ధరను ఫిక్స్ చేయడంలో మతలబు ఏంటని ఆయన నిలదీశారు. మరోవైపు

  వ్యాక్సినేషన్ పై ప్రధాని మోదీ ప్రకటన చాలా ఆలస్యమైందని, దాని ఖరీదు లక్షల నిండుప్రాణాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఫిబ్రవరి నుంచే తాను ఉచిత వ్యాక్సిన్ల కోసం కేంద్రానికి లేఖలు రాస్తూ వచ్చానని, కేవలం మోదీ నిర్లక్ష్య వైఖరి కారణంగానే భారత్ వైరస్ కష్టాలు రెట్టింపయ్యాయని ఆమె ఆరోపించారు. కనీసం జూన్ 21 నుంచే చేపట్టే వ్యాక్సినేషన్ ప్రక్రియనైనా ప్రాపగండా కోసం కాకుండా ప్రజాహితం కోసం చేపట్టాలని మోదీకి దీదీ చురక వేశారు.

  వ్యాక్సిన్లపై మోదీ యూటర్న్: ఘనత మాదేనన్న విపక్ష సీఎంలు -కరోనా థార్డ్ వేవ్‌ ఆగుతుందన్న బీజేపీ సీఎంలువ్యాక్సిన్లపై మోదీ యూటర్న్: ఘనత మాదేనన్న విపక్ష సీఎంలు -కరోనా థార్డ్ వేవ్‌ ఆగుతుందన్న బీజేపీ సీఎంలు

  English summary
  "If vaccines are free for all, why should private hospitals charge for them?" Congress leader Rahul Gandhi asked on Monday as the opposition party demanded universal free vaccination against COVID-19, after the prime minister announced that his government will provide free jabs to states for inoculation of all above the age of 18. West Bengal Chief Minister Mamata Banerjee said on Monday that the decision on vaccinating all above the age of 18 for free should have been taken long back and the delay has cost many lives.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X