వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా వల్ల కాదు... నేనుండా ... రాజీనామపై వెనక్కి తగ్గని...రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ససెమీరా కొనసాగనంటూ రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు...పార్టీ అధ్యక్షుడి ఎంపికతోపాటు పలు రాజకీయ అంశాలపై చర్చించేందుకు గాను బుధవారం ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది.. ఈ సమావేశంలో కూడ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ పార్టీ నేతలు కోరారు..అయితే వారి విన్నపాన్ని రాహుల్ గాంధి తిరస్కరించినట్టు తెలుస్తోంది.

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడ స్పష్టం చేసిన రాహుల్

పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడ స్పష్టం చేసిన రాహుల్

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీని గట్టేక్కించేందుకు పార్టీ నేతలు కరువయ్యారు..సార్వత్రిక ఎన్నికల్లో పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన రాహుల్ గాంధీ రాజీనామ చేశారు..దీనికితోడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న అమేథిలో కూడ ఆయన ఓటమీ పాలయ్యారు.. దీంతో పార్టీ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ ఆసక్తి చూపించడం లేదు..కానీ పార్టీకి నాయకత్వం వహించేందుకు రాహుల్ గాంధీ తిరిగి భాద్యతలు చేపట్టాని, పార్టీ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు.....అయితే రాహుల్ గాంధీ మాత్రం ససేమీరా అంటున్నాడు..ఈ నేపథ్యంలోనే కనీసం లోక్‌సభలో పార్టీ నేతగా కూడ ఆయన ఉండేందుకు నిరాకరించాడు..

రాహుల్ కొనసాగుతారని ప్రచారం

రాహుల్ కొనసాగుతారని ప్రచారం

అయితే కాంగ్రెస్ పార్టీలో పలు రాజకీయ పరిణామాలు చేటు చేసుకుంటున్నాయి...కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపడతారని వార్తలు వచ్చాయి..గత వారం పార్టీ నేతలతో సమావేశమయిన రాహుల్ తిరిగి పార్టీ పగ్గాలు చేపడతారని మహారాష్ట్ర్ర, హర్యాణకు చెందిన పార్టీ నేతలు ఆశభావం వ్యక్తం చేశారు..ఇక ఈనేపథ్యంలోనే మరోసారీ సోనియాగాంధీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ సమావేశం బుధవారం కొనసాగింది..దీంతో నేటి సమావేశంలో కూడ రాహుల్ గాంధీ తన రాజీనామకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది...

సీడబ్ల్యుసీ సమావేశంలో తేలనున్న రాహుల్ భవితవ్యం

సీడబ్ల్యుసీ సమావేశంలో తేలనున్న రాహుల్ భవితవ్యం

కాగా పార్టీ నేత ఎంపిక పై చర్చించేందుకు త్వరలో అత్యున్నత స్థాయి కమిటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశం కానుంది.. ఇక ఆ సమావేశంలో రాహుల్ నిర్ణయం పై మరోసారి చర్చించనున్నారు..అప్పుడు కూడ రాహుల్ గాంధీ రాజీనామకు కట్టుబడి ఉంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. కాగా ఇప్పటికే పార్టీ ఓటమీకి నైతిక బాధ్యత వహిస్తూ పలు రాష్ట్ర్రాల పార్టీ అధ్యక్షులు, ఇంచార్జులు రాజీనామ చేశారు..మరోవైపు ఉత్తర ప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్ర్రాల్లో పార్టీ కమిటీలను కూడ కాంగ్రెస్ హై కమాండ్ రద్దు చేసింది.

English summary
Adamant on stepping down as the Congress chief, Rahul Gandhi, Sources close to the Congress said Rahul Gandhi reiterated his decision at the party parliamentary party meeting, chaired by UPA chairperson Sonia Gandhi,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X