వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ముందస్తు కస్టడీకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సోర్‌లో కాల్పుల్లో రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలని పరామర్శించేందుకు ఆయన వచ్చా

|
Google Oneindia TeluguNews

భోపాల్: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ముందస్తు కస్టడీకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని మాండ్‌సోర్‌లో కాల్పుల్లో రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలని పరామర్శించేందుకు ఆయన వచ్చారు.

ఆరుగురు రైతుల మృతి:, ఫోన్లు బంద్, బిజెపి నేతలు ఇలా, అధికారులు అలా ఆరుగురు రైతుల మృతి:, ఫోన్లు బంద్, బిజెపి నేతలు ఇలా, అధికారులు అలా

కానీ ఆయనను పోలీసులు ముందస్తుగా కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు మాట్లాడితే మరింత తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Rahul Gandhi taken into preventive custody, not allowed to meet thefarmers

రైతులను కలిసేందుకు ఆయనకు అనుమతి ఇవ్వలేదు. అంతకుముందు రాహుల్ గాంధీ మాండ్‌సోర్ చేరేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఆయన తొలుత రాజస్థాన్ నుంచి కారులో మధ్యప్రదేశ్‌లోకి ఎంటర్ అయ్యారు.

రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మాండ్‌సోర్ బయలుదేరడానికి ముందు నుంచే పోలీసులు ఆయనను రానివ్వమని చెబుతున్నారు. ఆయన్ని సరిహద్దులోనే అడ్డుకుంటామని, పర్యటించేందుకు అనుమతించేది లేదని నీముచ్‌ ఎస్పీ తెలిపారు. ఆ తర్వాత ఆయన రాగానే అడ్డుకున్నారు. నీముచ్‌లో అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కాల్పుల వల్లే రైతుల మరణం: హోంమంత్రి

మాండ్‌సోర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పంటలకు మద్దతు ధరలు ఇవ్వాలని, రుణమాఫీ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రైతులు ఈ నెల ఒకటో తేదీ నుంచి ఆందోళన చేస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో అయిదారుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. తొలుత పోలీసులు కాల్పులు జరపలేదని, ఎవరు జరిపారో విచారణ చేస్తున్నామని అధికారులు అన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులే కాల్పులు జరిపినట్లు, అందువల్లే రైతులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి భూపేంద్ర సింగ్‌ ధ్రువీకరించారు.

గురువారం అక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. మాందసౌర్‌ పరిసర ప్రాంతంలో ఉన్న టోల్‌ప్లాజాను ఆందోళనకారులు ధ్వంసం చేసి దోపిడీకి పాల్పడ్డారు. దాదాపు రూ.10లక్షల వరకు దోచుకెళ్లారు. పరిస్థితిని అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ అక్కడి ఎస్పీ, కలెక్టర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది.

English summary
Congress Vice President Rahul Gandhi on Thursday was taken into preventive custody after he sent his security personnel into a tizzy. The Gandhi scion took a bike ride to reach Mandsaur in Madhya Pradesh where the police had shot dead five protesting farmers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X