వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ ట్వీట్: మేము సాధికారికత కోసం తెచ్చాం..మీరు వ్యక్తిగత సమాచారం కోసం ఆధార్ వినియోగించారు

|
Google Oneindia TeluguNews

ఆధార్ రాజ్యంగ బద్దమేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. యూపీఏ హయాంలోనే ఆధార్ ప్రవేశపెట్టామని సాధికారికతకు నిదర్శనంగా తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పిన రాహుల్ గాంధీ.. బీజేపీ హయాంలో మాత్రం ఒకరి వ్యక్తిగత సమాచారం తెలుసుకునేందుకు వినియోగించుకున్నారని తనదైన శైలిలో విమర్శించారు. కాంగ్రెస్ విజన్‌కు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

<strong>బ్యాంక్ అకౌంట్, మొబైల్‌కు నో, ఐటీకి ఇవ్వాలి</strong>బ్యాంక్ అకౌంట్, మొబైల్‌కు నో, ఐటీకి ఇవ్వాలి

బుధవారం ఆధార్‌పై కీలక తీర్పు ఇస్తూ... ఆధార్‌ రాజ్యాంగబద్దమే అని పేర్కొంది. అయితే వ్యక్తిగత సమాచారం కూడా ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని చెబుతూ బ్యాంక్ అకౌంట్లకు, మొబైల్ కంపెనీలకు, స్కూలు అడ్మిషన్లకు ఆధార్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది. ఇదిలా ఉంటే ఐటీ రిటర్న్స్‌కు పాన్‌కార్డుకు ఆధార్ తప్పనిసరి చేసింది సుప్రీంకోర్టు. అంతేకాదు సీబీఎస్సీ, నీట్ ఎంట్రన్స్ టెస్టులకు ఆధార్ తప్పనిసరికాదంటూ పేర్కొంది. ఆధార్ కార్డు లేని స్కూల్ పిల్లలకు ప్రభుత్వ పథకాలను విస్మరించరాదని చెప్పింది.

Rahul Gandhi thanks Supreme Court for supporting their partys vision

టెలికాం కంపెనీలు ఆధార్ కార్డును అడగవద్దని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ టెలికాం శాఖ ఇచ్చిన ఆదేశాలను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.మొబైల్‌ నంబరుతో అనుసంధానానికి అవసరం లేదని పేర్కొంది. ఆధార్ యాక్టులోను సెక్షన్ 57, సెక్షన్ (2)డీలను కూడా సుప్రీం కోట్టివేసింది. లావాదేవీల డేటాను బయటపెట్టరాదని పేర్కొంది.

English summary
Congress president Rahul Gandhi thanked the Supreme Court for its verdict on the Aadhaar Act on Wednesday, saying it was an instrument of empowerment for his party, but a “tool of oppression and surveillance” for the BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X