వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ శ్రేణులతో రాహుల్ గాంధీ నిరసన ప్రదర్శన.. రాష్ట్రపతికి 2 కోట్ల మంది సంతకాల అందజేత..

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ చట్టాలపై నిరసనలు మిన్నంటుతున్నాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు నేతల ఆందోళన కొనసాగుతోంది. వీరికి మద్దతుగా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా మద్దతుగా నిలుస్తోన్నాయి. రేపు (గురువారం) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి ర్యాలీగా రాష్ట్రపతి భవన్ వెళ్తారు. అక్కడ కోవింద్‌ను కలిసి.. రైతు సమస్యలను వివరిస్తారు.

వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. 2 కోట్ల మందితో సంతకాలను స్వీకరించింది. గురువారం దాని ప్రతీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రాహుల్ గాంధీ అందిస్తారు. ఎముకలు కోరికే చలిలో రైతు నేతలు/ అన్నదాతల నిరసన కొనసాగుతోంది. గురువారం ఉదయం విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ బిల్డింగ్ గుండా రాష్ట్రపతి భవన్ వరకు రాహుల్ గాంధీ బృందం ర్యాలీ చేస్తారు. తర్వాత రాష్ట్రపతిని కలిసి మెమోరాండం అందజేస్తారు.

Rahul Gandhi to lead Congress protest march, submit 2 crore signatures to President

రైతులు, రైతు కూలీల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే చేపట్టింది. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఇదివరకే రాహుల్ గాంధీ ట్రాక్టర్ యాత్ర చేపట్టారు. పంజాబ్, హర్యానా గుండా ఆయన యాత్ర కొనసాగింది. మిగతా రాష్ట్రాల్లో కూడా రైతుల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిరసం/ అనారోగ్య సమస్యల వల్ల ఇప్పటికీ 44 మంది రైతులు చనిపోయారు. వారి కుటుంబాలని ఆదుకోవాలని కూడా రైతు నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Former Congress president Rahul Gandhi will lead a protest march to the Rashtrapati Bhawan on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X