వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడు వయనాడ్‌కు రాహుల్.. మూడు రోజులపాటు సాగనున్న పర్యటన..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మూడు రోజుల పర్యటనలో భాగంగా కేరళ వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి ఆయన 4లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తనకు భారీ విజయం కట్టబెట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ వయనాడ్‌లో పర్యటించనున్నారు. జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో ఆయన ఆరు రోడ్ షోలు నిర్వహించినున్నారు.

ఉదయం పదిన్నరకు కల్పెట్టాలో రాహుల్ గాంధీ రోడ్ షో ప్రారంభంకానుంది. ఉ. 11:45గంటలకు కంబల్కాడ్, 12:30కు పనమారం, 2గంటలకు మనంతవాడీ, 3గంటలకు పుల్పల్లి, 4:30గంటలకు సుల్తాన్ బథేరీ మీదుగా మీదుగా ఆయన ర్యాలీ సాగనుంది.

Rahul Gandhi to Visit Wayanad Constituency For First Time After Win

శని, ఆదివారాల్లో వయనాడ్‌లోని వివిధ పట్టణాల్లో రాహుల్ పర్యటన సాగనుంది. తిరువంబాడి అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఆయన ప్రసంగించనున్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని రాహుల్ పరామర్శించనున్నట్లు వయనాడ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకటించారు. పార్టీ వైఫల్యంతో నిరాశలో కూరుకుపోయిన రాహుల్ గాంధీకి ఈ పర్యటనతో కొత్త ఉత్తేజం వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఎల్డీఎఫ్ అభ్యర్థిపై 4,31,063 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

English summary
After getting massive mandate from Wayanad in the recently-concluded Lok Sabha elections, Congress president Rahul Gandhi will make a three-day visit to the parliamentary constituency beginning Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X