వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు వయనాడ్‌లో రాహుల్ పర్యటన..! వరద బాదితులకు అండగా మాజీ కాంగ్రెస్ ఛీఫ్..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్ : తీవ్రంగా కురుస్తున్న వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలజీవితాలను అకాల వరదలు మృగ్యం చేస్తున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి జనాలు అల్లాడుతున్నారు. వరదల బీభత్సంతో జన జీవన శ్రవంతి అతలాకుతలం అవుతోంది. వరదల్లో చిక్కుకు పోయిన ప్రజలకు చేయూత అందించేందుకు కాంగ్రెస్ పార్టీ మాజీ అద్యక్షుడు రాహుల్ గాంధీ నడుంబిగించారు. రేపు వాయనాడ్ ముంపు గ్రామాల్లో పర్యటించి బాదితులను ఆదుకోనున్నారు రాహుల్ గాంధీ.

ముషీరాబాద్ నుండి సభ్యత్వం తీసుకోనున్న అమీత్ షా..! సెప్టెంబర్ 17న నగరంలో భారీ బహిరంగ సభ..!! ముషీరాబాద్ నుండి సభ్యత్వం తీసుకోనున్న అమీత్ షా..! సెప్టెంబర్ 17న నగరంలో భారీ బహిరంగ సభ..!!

రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో ఆదివారంనాడు పర్యటించే అవకాశం ఉంది. వరదలు, కొండచరియలు విరిగిపడి కేరళ అతలాకుతలం కావడంతో స్వయంగా బాధితులను పరామర్శించేందుకు, కార్యకర్తలతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేసేలా చూసేందుకు రాహుల్ కేరళ వెళ్తున్నారు.'బహుశా రేపు కేరళ వెళ్లొచ్చు. రెండు రోజులు అక్కడే ఉండే ఆలోచన కూడా ఉంది.

Rahul Gandhi to wayanad..! Tour in flood affected areas..!!

సహాయక చర్యలపై ఇప్పటికే ప్రధానితోనూ, ముఖ్యమంత్రితోనూ, కలెక్టర్లతోనూ మాట్లాడాను. సాధ్యమైనంత మందికి బాధితులకు సహాయం అందేలా చూసేందుకు ప్రయత్నిస్తాను. కేరళ కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా ఎప్పటికకప్పుడు సహాయక చర్యలపై మాట్లాడుతున్నాను' అని రాహుల్ గాంధీ మీడియాకు తెలిపారు. కేరళలో ఎడతెగని వర్షాలు, పలు నదులు పొంగుతుండటం, కొండచరియలు విరిగిపడి ఇంతవరకూ 28 మంది మృత్యువాత ప్డడారు.

మరో 27 మంది గాయాలబారిన పడినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకూ ఏడుగురి జాడ గల్లంతయినట్టు తెలిపింది. సైన్యం, ప్రకృతి వైపరీత్యాల సహాయక బృందాలు ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. గత కొద్దిరోజులుగా కేరళ, పొరుగు రాష్ట్రాల్లో ఎడతెగని వర్షాలు పడుతుండటంతో నదులు నిండుకుండల్లా తయారయ్యారు. వరద నీరు పొంగిపొర్లుతుండటంతో కేరళలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నిటిని రాహుల్ తన పర్యటనలో బాగంగా పర్యటించనున్నారు.

English summary
Rahul Gandhi is likely to tour on Sunday in Wayanad, Kerala, in his own constituency. Rahul is going to Kerala to visit the victims and talk to the activists to speed up the relief efforts as Kerala hits the floods and landslides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X