వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ సపోర్ట్: విత్ డ్రా చేస్తానంటే వద్దన్నారు: శశిథరూర్

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న శశిథరూర్ హాట్ కామెంట్ చేశారు. తన అభ్యర్థిత్వాన్ని రాహుల్ గాంధీయే అంగీకరించారని తెలిపారు. తాను విత్ డ్రా అవుతానని కామెంట్ చేస్తే.. వద్దన్నారని గుర్తుచేశారు, వాస్తవంగా ఖర్గేకు గాంధీ కుటుంబం ఖర్గేను సపోర్ట్ చేస్తోంది. ఇంతలో థరూర్ ఇలా కామెంట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కేరళ పీసీసీ చీఫ్ సుధాకరన్ బహిరంగంగానే ఖర్గేకు సపోర్ట్ చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ క్రమంలో థరూర్ తనకు రాహుల్ సపోర్ట్ ఉందనే అంశాన్ని తెలిపారు. తాను విత్ డ్రా అవుతానని చెప్పినా.. రాహుల్ వద్దన్నారని పేర్కొన్నారు. తాను రేసులో ఉంటే.. పార్టీకి ప్రయోజనం ఉందని వివరించారు.

 Rahul Gandhi turned down requests to coax me:Shashi Tharoor

కాంగ్రెస్ అధ్యక్ష పదవీ రేసులో థరూర్‌తో పాటు మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్ ఉన్నారు. థరూర్ మాత్రమే రెబల్ క్యాండిడేట్‌గా ఉన్నారు. దిగ్గీరాజాపై సోనియా, రాహుల్ గాంధీకి మంచి అభిప్రాయమే ఉంది. ఖర్గేకు ఏకపక్షంగా సపోర్ట్ చేస్తున్నారనే అంశం జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వారు. అధ్యక్ష పదవీని దళితుడికి ఇచ్చామని చెప్పి మార్కులు కొట్టేసే అవకాశం ఉంది. మెజార్టీ సభ్యులు కూడా ఖర్గేకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది.

సోనియా గాంధీకి అనారోగ్య సమస్యలు ఉండటంతో అధ్యక్ష పదవీకి ఎన్నుకోవడం అనివార్యం అయ్యింది. ఇటు రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో గాంధీయేతర నేతను ఎన్నుకోవాల్సి వచ్చింది.

English summary
shashi Tharoor said party leaders had sought his withdrawal from the party president race but the former Congress chief rahul gandhi did not agree to do that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X