వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ ఎక్కడ ..? సభలో రాందాస్ ప్రశ్న, ఇదిగో వస్తున్నానంటు ట్వీట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ కొలువుదీరిందో లేదో .. అప్పుడే ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. ఎంపీగా ప్రమాణం చేసే సమయంలో సాద్వీ తన గురువు పేరును పలికి అగ్గిరాజేయగా .. కేంద్రమంత్రి రాందాస్ అథవాలే రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ఎక్కడ అంటూ ఆయన వేసిన ప్రశ్నతో .. ట్విట్టర్‌లో సమాధానం వచ్చింది.

నమో నమ :
సభ కొలువుదీరాక ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ఒక్కొక్కరితీ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, భాగస్వామ్య పక్షాలు .. విపక్ష సభ్యుల ప్రమాణం కొనసాగుతుంది. అయితే ఇంతలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత, కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కల్పించుకున్నారు. తనకు కేటాయించిన సీట్లో రాహుల్ కనిపించకపోవడంతో ఎక్కడ అని ప్రశ్నించారు. ఇవాళ, రేపు ఎంపీల ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో రాహుల్ ఇవాళ ప్రమాణం చేస్తారా అని ఒకింత అనుమానంతో ప్రశ్నించారు అథవాలే.

Rahul Gandhi tweets, takes oath after taunt from Ramdas Athawale

రాహుల్ ఎక్కడా ..?
సభలో నరేంద్ర మోడీ ప్రమాణం చేసే సమయంలో సభ్యులు మోడీ, మోడీ అంటూ నినాదాలు చేశారు. భారత్ మాతా కీ జై అనే నినాదాలతో హోరెత్తించారు. అయితే ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీ సభలో తగిన సంఖ్య బలంలేక మిన్నకుండిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత రాహుల్ ప్రజలతో మమేకం కాలేదు. అమేథీలో కేంద్రమంత్రి సృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన రాహుల్ .. వాయనాడులో మాత్రం గెలిచారు. దీంతో అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు మూడురోజులు పర్యటించిన సంగతి తెలసిందే.

దీంతో పార్లమెంట్ మొదటిరోజు రాహుల్ కనిపించకపోవడంతో ఆయన గురించి ఆరాతీశారు అథవాలే. ఇంతకీ రాహుల్ వస్తారా అని ప్రశ్నించగా .. కొన్ని నిమిషాల తర్వాత రాహుల్ స్పందించారు. తన నాలుగో లోక్‌సభకు ఇవాళ హాజరవుతారని రాహుల్ పేర్కొన్నారు. వాయనాడు నుంచి గెలిచిన తాను మధ్యాహ్నం సభలో ప్రమాణం చేస్తానని ప్రకటించారు. ఇక్కడ ప్రజల కోసం నీతిగా, న్యాయంగా పనిచేస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు. చెప్పినట్టే సాయంత్రం 4 గంటలకు సభకు చేరుకొని .. ప్రమాణం చేశారు రాహుల్.

English summary
where is Rahul Gandhi" was the question that seemingly unnerved the Congress’s Lok Sabha MPs who had come to take oath on the first day of the first session of the 17th Lok Sabha today. The question came from Union minister and Republican Party of India leader Ramdas Athawale.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X