వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ వర్సెస్ అరవింద్: 5 అంశాల్లో భేదాలు

|
Google Oneindia TeluguNews

Rahul Gandhi versus Arvind Kejriwal: 5 factors that made a difference
న్యూఢిల్లీ: ఢిల్లీలో మూడు సార్లు గెలిచి అధికారంలో కొనసాగిన 128ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ఏడాది కూడా పూర్తి కాని ఆమ్ ఆద్మీ పార్టీ కూలదోసింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన పెద్ద విజయంగా చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఈ అనుభవం నుంచి కాంగ్రెస్ పార్టీ కొన్ని పాఠాలు నేర్చుకుని పార్టీ సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఓటమితో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిని నుంచి ఏమైనా నేర్చుకోవాల్సి ఉందా లేక అధికారం కోల్పోయిన రాష్ట్ర పార్టీ సరైన రీతిలో తన పాలనను కొనసాగించలేకపోయిందా అనేది తెలుస్తోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రివాల్ మధ్య ఐదు భేదాలను గమనిద్దాం..

ఆమ్ ఆద్మీ సెంటిమెంట్

ఆమ్ ఆద్మీ అర్థాన్ని కాంగ్రెస్ మరిచిపోయిందని ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకుకెళ్లింది. చాలా కాలంపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పునాదివేళ్లతో పెకిలించివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాలు ప్రజలకు, ప్రభుత్వానికి అంతరం పెంచేలా చేశాయి. దీనిని గుర్తించిన ఆమ్ ఆద్మీ పార్టీ అవే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమి పొందేలా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక పెంచుకున్న విద్యావంతులు, యువకులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలను అత్యధిక స్థానాల్లో గెలిపించారు.

పరిస్థితిపై ప్రశ్న

ఢిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకర్షక పథకాలు అమలు చేయడంలో ఎంత వరకు సఫలమైందనే విషయాన్ని కేజ్రివాల్ ప్రశ్నించారు. కేజ్రివాల్ ఎప్పుడూ సమాజంలోని లోపాలను ఎత్తిచూపడంలో ముందుండేవారు. కేజ్రీవాల్ నుంచి రాహుల్ ఇలాంటి విషయాలను నేర్చుకోవాల్సి ఉందని తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో తన ప్రభావాన్ని చాటుకోవడం కేజ్రివాల్‌కు భారీ విజయంగానే చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ కంటే ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీ సంవత్సర కాలంగా ప్రజలతో మమేకమై తన కార్యకలాపాలను కొనసాగించింది.

ఆమ్ ఆద్మీ లాంటి పార్టీల నుంచి పోటీని ఎదుర్కొవాలంటే ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల నమ్మకాన్ని పెంచాల్సిన అవసరం రాహుల్ గాంధీపై ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగిన షిలా దీక్షిత్‌కే ప్రజలు మళ్లీ పట్టం కడతారని ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫలితాలను ఊహించలేకపోయింది. దీంతో కేజ్రివాల్ అధికారంలో కొనసాగుతున్న షిలా దీక్షిత్‌పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. అయితే ఢిల్లీలో తమ ప్రభుత్వం ఎలా కొనసాగుతోందనే అంశంపై రాహుల్ గాంధీ అంతగా దృష్టి సారించనట్లే తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ.. కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే చాలా చిన్నదైనప్పటికీ కేజ్రీవాల్ ఎంతో సమర్థవంతంగా నడిపించాడు. ఫలితాలను గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీని ఆ విధంగా రాహుల్ నడిపించలేకపోయారనేది తెలుస్తోంది.

నాయకుడికంటే ఎక్కువగా కేజ్రివాల్

రాజకీయాల్లో కొత్తగా ప్రవేశించినప్పటికీ నాయకత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించిన కేజ్రివాల్ తన పార్టీని విజయపథంలో నడిపించి ఎక్కువ స్థానాలను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పార్టీని సమర్థవంతంగా నిర్వహిస్తూ మీడియా ద్వారా ప్రచారాన్ని సరైన రీతిలో కొనసాగించడంలో సఫలమయ్యారు. కేజ్రివాల్ కంటే రాహుల్ గాంధీ ఎక్కువగా ప్రచారంలో ఉన్నప్పటికీ తమ పార్టీని సరైన రీతిలో నియంత్రించలేకపోయారని తెలుస్తోంది.

ప్రజల్లోకి చొచ్చుకుని పోయిన కేజ్రివాల్ తమ పార్టీకి విస్త్రుత ప్రచారం నిర్వహించారు. ఎలాంటి దురంహకార పూరిత మాటలను ఉపయోగించకుండా కేజ్రివాల్ తన ప్రచారాన్ని కొనసాగించారు. అయితే రాహుల్ కొన్ని వ్యాఖ్యలతో బాధ్యత రాహిత్యాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. తనను చంపాలని చూస్తున్నారని, ఉత్తరప్రదేశ్ అల్లర్ల తర్వాత పాకిస్థాన్ మన దేశ యువతను ప్రభావితం చేస్తోందని చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదమయ్యాయి.

నిర్భయ ఘటన

దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్‌లో జరిగిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య పట్ల కేజ్రివాల్ పార్టీ తీవ్ర ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర స్థాయిలో స్పందించారు. అయితే ఇలాంటి పెద్ద ఘటన పట్ల రాహుల్ సరైన రీతిలో స్పందించలేదనే తెలుస్తోంది. రాహుల్ యువ నాయకుడు కాబట్టి ఇలాంటి అంశాలపై స్పందించి సామాన్యులకు దగ్గరయ్యే అవకాశాలను ఉపయోగించుకోవడం అంతగా సఫలీకృతులు కాలేదని చెప్పుకోవచ్చు. నిర్భయ ఘటనతో సామాన్య ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

నిజాయితీ రాజకీయాలు

అవినీతి పరులైన రాజకీయ నాయకులపై కాంగ్రెస్ వ్యవహార తీరు సరైన రీతిలో లేదనే చెప్పుకోవచ్చు. పార్టీ నాయకుడిగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ తన పార్టీలో కొనసాగుతున్న ఇలాంటి వ్యవహారాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాహుల్ ఇలాంటి వ్యవహారాలను సమర్థవంతంగా ఎదుర్కొని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉందనే చెప్పవచ్చు. అదే సమయంలో కేజ్రివాల్ నిజాయితీ రాజకీయాలను ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లారు.

English summary

 A one-year-old party decimates a 128-year-old party in the recently concluded Delhi elections, throwing it out of power after 15 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X