వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చివరి ప్రయత్నం.... సీఎంలు దిగివచ్చిన వేళ

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధి రాజీనామపై వెనక్కి తగ్గక పోవడంతో చివరి సారిగా కాంగ్రెస్ పార్టీ సీఎంలు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు... ఈనేపథ్యంలోనే రాహుల్ గాంధితో పంజాబ్ సీఎం క్యాప్టెన్ అమరిందర్ సింగ్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ తోపాటు చత్తీడ్‌గఢ్ సీఎం భూపేష్ భాగల్ తోపాటు పుదుచ్చేరీ సీఎం నారయణ స్వామిలు రాహాుల్ గాంధీతో సుమారు రెండు గంటలపాటు భేటి అయ్యారు. ఓటమికి నైతిక భాద్యత వహిస్తూ రాజీనామ చేసిన రాహుల్ గాంధీ పై ఒత్తిడి పెరిగినా... తాను మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్ర్రాల నేతలు,పార్టీ కీలక నాయకులు సైతం తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.

రెండు గంటల పాటు రాహుల్‌తో సమావేశమైన సీఎంలు

రెండు గంటల పాటు రాహుల్‌తో సమావేశమైన సీఎంలు

ఇక రాహుల్ గాంధీతో భేటి అనంతరం రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లడుతూ...పార్టీ నాయకులతోపాటు కార్యకర్తల అభిప్రాయాలను రాహుల్‌కు తెలియ చేశామని చెప్పారు..ఈనేపథ్యంలోనే తమ అభిప్రాయాలను గౌరవించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటారని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.కాగా అంతకు ముందు మాట్లాడిన ఆయన ప్రస్థుత రాజకీయ పరిస్థితుల వల్ల రాహుల్ గాంధి తిరిగి బాధ్యతలు చేపట్టాలని ఆయన కోరారు. రాహుల్ గాంధికి ఉన్ననిబద్దతతోపాటు దేశ ప్రజల శ్రేయస్సు దృష్ట్య ఆయన పార్టీ పగ్గాలు తీసుకోవాలని అన్నారు..

పార్టీ పదవులకు రాజీనామలు సమర్పించిన నాయకులు...

పార్టీ పదవులకు రాజీనామలు సమర్పించిన నాయకులు...


ఈనేపథ్యంలోనే అశోక్ గెహ్లాట్ సైతం రాజస్థాన్‌లో ఓటమికి పూర్తిగా నైతిక వహిస్తున్నట్టు ప్రకటించారు.దీంతోపాటు ఎన్నికల్లో గెలపు ఓటములు సహజమని అన్నారు..కాగా పార్టీ ఓటమికి ఉమ్మడి బాధ్యత వహిస్తున్నట్టు పలువురు నేతలు ప్రకటించారని ,ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ తన రాజీనామ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు..కాగా కొద్ది రోజుల క్రితమే జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన రాజస్థాన్,మధ్యప్రదేశ్ రాష్ట్ర్రాల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఒకటి , రెండు సీట్లకు పరిమితం కావడంతో అయా రాష్ట్ర్ర్రాల ముఖ్యమంత్రులు పాత్ర ఉన్నట్టు రాహుల్ గాంధీ గ్రహించాడు..ఈ నేపథ్యంలోనే పార్టీ ఓటమికి ఆయా రాష్ట్ర్రాల సీఎంలు కూడ నైతిక బాధ్యత వహించాలని ఆయన కోరారు.

చివరి ప్రయత్నంగా సీఎంల భేటీ...

చివరి ప్రయత్నంగా సీఎంల భేటీ...


ఈనేపథ్యంలోనే పలు రాష్ట్రాల నేతలు పార్టీ పదవులు రాజీనామల చేశారు..దీంతో మధ్య ప్రదేశ్ సీఎం గా ఉన్న కమల్ నాథ్, తోపాటు రాజస్థాన్ సీఎం, చత్తీస్‌గఢ్ సీఎంలు సైతం పార్టీ అధ్యక్ష పదవులు రాజీనామ చేశారు...అయినా రాహుల్ గాంధీ మాత్రం వెనక్కి తగ్గేందుకు వెనకడుగు వేస్తున్నారు..దీంతో ఆయనే అధ్యక్షుడిగా కొనసాగాలంటూ యువజన కాంగ్రెస్ నాయకులు సైతం పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఇంటి వరకు ర్యాలీలు చేపట్టారు..అయితే రాహుల్ మాత్రం ఎలాంటీ నిర్ణయాన్ని ప్రకటించలేదు...ఈ నేపథ్యంలోనే అనేక మంది సీనియర్ నేతలు రాహుల్‌ను కలిసి నచ్చజెప్పినా...ససేమీరా అనడంతో చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సీఎంలు నేడు రాహుల్ కలసి సుమారు రెండు గంటల పాటు సమావేశయ్యారు.

ఇక ఇప్పుడు కూడ రాహుల్ గాంధీ తన రాజీనామను వెనక్కి తీసుకోకపోతే రానున్న సీడబ్ల్యూసీలో చర్చించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది.

English summary
Punjab CM Captain Amarinder Singh, Madhya Pradesh CM Kamal Nath, Rajasthan CM Ashok Gehlot, Chhattisgarh CM Bhupesh Baghel, & Puducherry CM V Narayanasamy met Congress President Rahul Gandhi to urge him to take back his resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X