వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాలా మంచి పని చేశారు: యోగికి రాహుల్ గాంధీ ప్రశంసలు

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్‌లో రైతు రుణాలను మాఫీ చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని ఆయన మెచ్చుకున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తొలిసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్‌లో రైతు రుణాలను మాఫీ చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని ఆయన మెచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీపై విమర్శలు కురిపిస్తూనే.. యోగి సరైన మార్గంలో వెళ్తున్నారని అభినందించారు రాహుల్.

బీజేపీ సరైనా దారిలో..

బీజేపీ సరైనా దారిలో..

‘ప్రభుత్వ నిర్ణయంతో బ్యాంకు రుణాల నుంచి యూపీ రైతులకు పాక్షికంగా ఉపశమనం లభించింది. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ ఇవ్వడాన్ని కాంగ్రెస్‌ ఎల్లప్పుడూ మద్దతిస్తుంది' అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికైనా బీజేపీ సరైన దారిలో వెళ్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

వివక్ష వద్దు..

వివక్ష వద్దు..

రైతుల సమస్యలపై రాజకీయాలు చేయొద్దని కేంద్రానికి రాహుల్ హితవు పలికారు. రైతుల కష్టాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, అంతేగాక రాష్ట్రాల మధ్య వివక్ష చూపకూడదని రాహుల్‌ ట్విట్టర్లో పేర్కొన్నారు.

తొలి కేబినెట్ భేటీలోనే..

తొలి కేబినెట్ భేటీలోనే..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన మంగళవారం తొలి కేబినెట్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్రంలోని సన్న, చిన్నకారు రైతులకు చెందిన రూ. 36,359 కోట్ల రుణాలను రద్దు చేస్తున్నట్లు సీఎం యోగి ప్రకటించారు.

వాగ్ధానం నెరవేర్చారు..

వాగ్ధానం నెరవేర్చారు..

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే తొలి భేటీలోనే రైతుల రుణాల మాఫీ నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. ఈ మేరకు యోగి ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ తోపాటు పలువురు రాజకీయ నాయకులు కూడా సీఎం యోగిని ప్రశంసిస్తున్నారు.

English summary
Congress Vice President Rahul Gandhi on Wednesday hailed Uttar Pradesh Chief Minister Yogi Adityanath's decision to waive off farm loans calling it a step in the right direction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X