వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీకు ‘రాహుల్ జిన్నా’నే కరెక్ట్: రాహుల్‌కు బీజేపీ చురకలు, శివసేన వార్నింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన పేరు 'రాహుల్ సావర్కర్ కాదు..'అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగారు. రాహుల్ గాంధీకి 'రాహుల్ జిన్నా' అనే పేరు సరిగ్గా సరిపోతుందని జీవీఎల్ చురకలంటించారు.

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారత్ బచావో ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్‌లో అత్యాచారాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై ఎంతమాత్రం క్షమాపణలు చెప్పేది లేదని అన్నారు. అంతేగాక, తానేమీ రాహుల్ సావర్కర్ కాదంటూ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో జీవీఎల్ నర్సింహారావు.. రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఆయనకు రాహుల్ జిన్నా అనే పేరు సరిగ్గా సరిపోతుందని అన్నారు. ముస్లింలను సంతృప్తి పరిచే రాజకీయాలు చేస్తూ పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాకు నిజమైన వారసుడిగా మారారని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ ఏది మాట్లాడితే అది మాట్లాడే రాహుల్.. దేశభక్తి కలిగిన సావర్కర్‌కు పోలికేంటని మరో బీజేపీ నేత సంబిత పాత్ర నిలదీశారు. ఆయనెప్పటికీ రాహుల్ సావర్కర్ కాలేరని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ అన్నారు.

Rahul Jinnah more appropriate name for Rahul Gandhi: BJP

రాహుల్ వ్యాఖ్యలపై మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. వీర్ సావర్కర్ విషయంలో తాము రాజీపడేది లేదని స్పష్టం చేసింది. హిందుత్వం కోసం పాటుపడిన వారి విషయంలో శివసేన వైఖరి స్పష్టంగా ఉంటుందని, మరో కోణానికి తావులేదని ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

వినాయక్ సావర్కర్ దేశానికి గర్వకారణమని.. గాంధీ, నెహ్రూల మాదిరిగానే సావర్కర్ కూడా తన జీవితాన్ని దేశ సేవలో త్యాగం చేశారని రౌత్ అన్నారు. స్వతంత్రోద్యమ మహనీయులను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. అర్థమయ్యేవారికి అర్థమైందనుకుంటాను అని ట్విట్టర్ వేదికగా సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.

English summary
Hitting back at Rahul Gandhi for his Savarkar jibe at the BJP, the ruling party on Saturday said a "more appropriate" name for the Congress leader is "Rahul Jinnah" as his "Muslim appeasement" politics makes him a worthy legatee of Pakistan's founder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X