వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ కోసం : అమెరికా వెళ్లనున్న రాహుల్ గాంధీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ అమెరికా వెళ్లనున్నారు. తల్లి సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం ఆయన శుక్రవారం అమెరికా వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి సరిగా లేనందున ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య పరీక్షలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

యూపీఏ ప్రెసిడెంట్ సోనియాగాంధీ 2011లో అమెరికాలో సర్జరీ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఏడాదికోసారి ఆమె మెడికల్ చెకప్ కోసం అక్కడికి వెళ్తున్నారు. చెకప్ కోసం వెళ్లే సమయంలో రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ ఆమెతో వెళ్తారు. అయితే ప్రస్తుతం ప్రియాంక గాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా ట్రీట్‌మెంట్ కోసం ఇప్పటికే అమెరికా వెళ్లారు. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాద్రా మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని జూన్‌లో కోర్టును అభ్యర్థించారు. అందుకు కోర్టు అంగీకరించడంతో భార్యతో కలిసి అమెరికాకు వెళ్లారు. రాహుల్, సోనియాలు అమెరికా వెళ్లిన తర్వాత వారిని కలుస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Rahul leaving for US for mother’s medical review

ఇదిలా ఉంటే తల్లి మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్లేందుకు రెండు రోజుల ముందు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంపై పలువురు నేతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ సమయంలో ఆయన రిజైన్ చేయడంపై నేతలు గందరగోళానికి గురవుతున్నారు. నిజానికి ఆయన గురువారం రాజీనామా నిర్ణయాన్ని వెలువరించాలనుకున్నారని సమాచారం. అయితే ఓ కేసు విషయంలో కోర్టులో హాజరుకావాల్సి ఉన్నందున బుధవారమే అధికారికంగా రాజీనామా చేశారు.

English summary
Rahul Gandhi, who formally resigned as Congress president, would leave for the United States on Friday for his mother Sonia Gandhi’s medical review.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X