• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేడు సీడబ్ల్యూసీ సమావేశం... అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా..?

|

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఘోర పరాజయం చూసిన కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను ఆత్మపరిశీలన చేసుకుంటోంది. ఇందులో భాగంగానే శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ చీఫ్‌లు తమ రాజీనామా లేఖలను సమర్పించారు.

మోడీ సునామాలో కొట్టుకుపోయిన మహామహులు

మోడీ సునామాలో కొట్టుకుపోయిన మహామహులు

ఉత్తర్ ప్రదేశ్ పార్టీ చీఫ్ రాజ్‌బబ్బర్, కర్నాటక ప్రచార నిర్వహణాధికారి హెచ్‌కే పాటిల్, ఒడిషా చీఫ్ నిరంజన్ పట్నాయక్‌లు ఉన్నారు. ఒడిషాలో కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఒక్క రాయ్‌బరేలీ సీటు మాత్రమే గెలుచుకుంది.అదికూడా యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ పోటీచేసిన రాయ్‌బరేలీ మాత్రమే గెలిచింది. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రియాంకా గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలు చాలా కష్టపడ్డప్పటికీ ఫలితం దక్కలేదు.

 ఏకంగా 9 మంది కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు ఓటమి

ఏకంగా 9 మంది కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు ఓటమి

ఇక ఫతేపూర్ సీక్రీ నుంచి బరిలో నిలిచిన రాజ్‌బబ్బర్ కూడా ఓటమిపాలయ్యారు.కాంగ్రెస్ ఓటమి ఎంత తీవ్రతగా ఉన్నిందంటే 9 మంది మాజీ ముఖ్యమంత్రులు ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిచెందారు. ఇందులో వీరప్పమొయిలీ, అశోక్ చవాన్, సుషీల్ కుమార్ షిండే, షీలా దీక్షిత్, భూపేందర్ సింగ్ హూడా, దిగ్విజయ్ సింగ్, హరీష్ రావత్, నంబం టుకీ, ముకుల్ సంగ్మాలు ఉన్నారు.మొత్తం 29 రాష్ట్రాల్లోని 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. క్రితం సారికంటే ఎక్కువగానే కాంగ్రెస్ పార్టీ సీట్లు సాధించినప్పటికీ... ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లు మాత్రం దక్కించుకోలేకపోయింది.

 పనిచేయని రాఫెల్ విమర్శ..

పనిచేయని రాఫెల్ విమర్శ..

ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు మెల్లగా ఒక్కొక్కొటిగా బయటకు వస్తోంది. కారణాలను పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. రాఫెల్ పై పదే పదే మాట్లాడారు కానీ.. దాన్ని ప్రజల ముందు నిరూపించలేకపోయారని కాంగ్రెస్ పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. అంతేకాదు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పడం.. అదేసమయంలో బీజేపీ బోఫోర్స్ అంశాన్ని లేవనెత్తడంలాంటివి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టాయని ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నరేంద్రమోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వంటివి కాంగ్రెస్‌కు కలిసి రాలేదు. ఇక రాహుల్ గాంధీకి ఈ ఎన్నికల ఫలితాలు రెండోసారి అతిపెద్ద షాక్‌ను ఇచ్చాయి. ముందుగా 2014లో ఓటమి, కానీ ఆ సమయంలో ఆయన పార్టీ అధ్యక్షుడిగా లేరు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ సొంత నియోజకవర్గం అమేథీలో కూడా ఓటమి పాలవడం కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది.

మొత్తానికి ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన రాజీనామా లేఖను సమర్పించినా... అది ఆమోదం పొందే అవకాశం లేదు. కచ్చితంగా తిరస్కరణకు గురవుతుందని కొందరు కాంగ్రెస్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As the dust settles down after the Lok Sabha results, the Congress is all set to go into an introspection mode. A meeting of the Congress Working Committee has been called on Saturday morning to deliberate on the reasons for the defeat. Congress president Rahul Gandhi is all set to tender his resignation, accepting responsibility for the rout that the party has faced.Several resignations also reached the Congress president on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more