బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్‌గాంధీకి షాక్‌పై కాలేజ్ అమ్మాయి లెటర్.. ఇదే

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రెండు రోజుల క్రితం బెంగళూరులోని ఓ మహిళా కళాశాలలో ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి చుక్కెదురైన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్, ఉద్యోగాలు తదితర అంశాల పైన కాలేజ్ అమ్మాయిలు యువనేతకు షాకిచ్చారు.

అయితే, రాహుల్ గాంధీకి కళాశాలలో ఎలాంటి షాక్ ఎదురు కాలేదని ఆ కాలేజీకి చెందిన అమ్మాయి ఓ ఓపెన్ లెటర్ సామాజిక అనుసంధాన వేదికల్లో ఉంచింది. బెంగళూరులోని ప్రముఖ మౌంట్ కార్మెల్ కళాశాల విద్యార్థినులతో రాహుల్ బుధవారం సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ విజయవంతమైందా అని ప్రశ్నిస్తే... అమ్మాయిల నుంచి 'అవును' అని సమాధానం వచ్చింది. ఉద్యోగాలు వస్తున్నాయా అని ప్రశ్నిస్తే 'అవును' అని ఎక్కువ మంది నుంచి సమాధానం వచ్చింది. దీంతో అవాక్కవడం రాహుల్ గాంధీ వంతయింది.

Rahul not stumped: Mount Carmel student

అయితే, ఇదంతా నిజం కాదని, అక్కడ జరిగిన దాని కంటే ఎక్కువ చేసి చెబుతున్నారంటూ అదే కళాశాలకు చెందిన ఎలిగ్జిర్ నహర్ పేర్కొన్నారు. ఆమె ఓ లేఖ రాసి, దానిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 1,437 పదాలు ఉన్న ఈ లేఖలో రాహుల్ వేసిన ప్రశ్నలు, వాటికి విద్యార్థులు స్పందించిన తీరు రాశారు.

రాహుల్ ప్రశ్నలకు మిశ్రమ స్పందన వచ్చిందని, ఆయన చాలా సరదాగా మాట్లాడారని ఆమె తెలిపారు. కేవలం స్వచ్ఛ భారత్ పైనే కాకుండా మేకిన్ ఇండియా పైన రాహుల్ ప్రశ్నలు వేశారని చెప్పారు.

దీనికీ మిశ్రమ స్పందనే వచ్చిందని, మేక్ ఇన్ ఇండియా ద్వారా మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని మీరు నమ్ముతున్నారా? అనే ప్రశ్నకు చాలా మంది విద్యార్థినులు ‘నో' అనే సమాధానం చెప్పారని పేర్కొన్నారు. అయితే, మొత్తానికైతే రాహుల్‌కు చేదు అనుభవం ఎదురైందని ఆమె లెటర్ ద్వారా కూడా అర్థమవుతోంది.

An Open Letter to #RahulStumped Enthusiasts Those ‘No Ragging’ posters you vaguely see around educational institutions...

Posted by Elixir Nahar on Wednesday, November 25, 2015

English summary
People of the country currently are busy in debates, be it on tolerance, intolerance or be it on #RahulStumped or not. Debate on the Congress Vice President surfaced following his visit to all-women Mount Carmel College in Bengaluru on Wednesday, Nov 25.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X