వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పుగా మాట్లాడాను... క్షమించండి.. సుప్రీంకోర్టుకు సారీ చెప్పిన రాహుల్ గాంధీ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

సుప్రీంకోర్టుకు సారీ చెప్పిన రాహుల్ గాంధీ..! || Oneindia Telugu

ఢిల్లీ : ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌకీదార్ చోర్ వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ఎట్టకేలకూ మెట్టు దిగొచ్చారు. రాఫెల్ కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యల్ని వక్రీకరించినందుకు సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. తనపై దాఖలైన కోర్టు ధిక్కార పిటీషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.

అన్ని హద్దులు దాటేశారు..ప్రియాంక, మమతపై సుష్మా ఆగ్రహం...అన్ని హద్దులు దాటేశారు..ప్రియాంక, మమతపై సుష్మా ఆగ్రహం...

 కోర్టుకు బేషరతు క్షమాపణ

కోర్టుకు బేషరతు క్షమాపణ

ధర్మాసనం వ్యాఖ్యల్ని తప్పుగా ఆపాదించినందుకు రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణ చెప్పారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ వ్యాఖ్యల చేయలేదని అఫిడవిట్‌లో రాహుల్ కోరారు. కోర్టులపై తనకు అపారమైన గౌరవం నమ్మకం ఉన్నాయని, వాటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని తానెప్పుడూ అనుకోలేదని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరినందున తనపై దాఖలైన కోర్డు ధిక్కార పిటీషన్‌ను కొట్టివేయాలని రాహుల్ విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై శుక్రవారం విచారణ జరపుతామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

చౌకీదార్ చోర్ అని కోర్టు చెప్పిందన్న రాహుల్

చౌకీదార్ చోర్ అని కోర్టు చెప్పిందన్న రాహుల్

ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు రాఫెల్ కేసులో తీర్పుపై రివ్యూకు అంగీకరించింది. కేసు విచారణలో మీడియా వద్ద ఉన్న డాక్యుమెంట్లను కూడా పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ.. చౌకీదార్ చోర్ అన్న విషయాన్ని కోర్డు కూడా అంగీకరించిందని అన్నారు. ఈ కామెంట్లపై అభ్యంతరం వ్యక్తంచేసిన బీజేపీ.. సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసింది.

గతంలో క్షమాపణ కోరని కాంగ్రెస్ ప్రెసిడెంట్

గతంలో క్షమాపణ కోరని కాంగ్రెస్ ప్రెసిడెంట్

బీజేపీ పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఆయన.. చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యలను వక్రీకరించినందుకు విచారం వ్యక్తంచేస్తున్నట్లు ఏప్రిల్ 30న అఫిడవిట్ దాఖలు చేశారు. రాహుల్ క్షమాపణ చెప్పకపోవడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆయన బేషరతు సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణ చెప్పారు.

English summary
Congress president Rahul Gandhi, offers unconditional apology to the Supreme Court. in his apology he said that he had unintentionally and inadvertently linked its Rafale case order to his Chowkidar chor hai phrase against Prime Minister Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X