వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మసూద్ అజార్‌ను పాకిస్తాన్‌కు అప్పగించిందెవరు: బీజేపీపై రాహుల్ ధ్వజం

|
Google Oneindia TeluguNews

పుల్వామా దాడులు వెనక మాస్టర్ మైండ్ మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చడంపై ఘనత తమదే అన్న బీజేపీపై మండిపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కాందహార్ ఘటనను గుర్తుచేసిన రాహుల్ గాంధీ.. మసూద్ అజార్‌ను పాకిస్తాన్‌కు ఎవరు పంపారని ప్రశ్నించారు. ఉగ్రవాదానికి తల వచ్చింది ఎవరు అతనిని విడుదల చేసిందెవరని ప్రశ్నించారు.

దేశంలో అలజడి సృష్టిస్తే ఖబడ్దార్: మోడీ

దేశంలో అలజడి సృష్టిస్తే ఖబడ్దార్: మోడీ

మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ముద్రవేయడం తమ ప్రభుత్వ విజయమని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాహుల్ ఈ తరహా అటాక్‌కు దిగారు.ఇక ఇప్పటి నుంచి ఎవరైనా దేశంలో అలజడి సృష్టించాలని చూస్తే వారు ఉంటున్న ఇళ్లలోకి ప్రవేశించి వారిని అంతం చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బుల్లెట్ల వర్షం బలగాలపై కురిపిస్తే వారిపై బాంబులు విసురుతాం అంటూ ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక గత కొన్నేళ్లుగా ప్రపంచదేశాలు భారత్‌ మాట వింటున్నాయని అన్నారు ప్రధాని. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని అంతం కాదని చెప్పారు ప్రధాని. ఇక భవిష్యత్తులో ఏమి జరుగుతుందో వేచిచూడండి అంటూ మోడీ తెలిపారు.

 సర్జికల్ స్ట్రైక్స్‌ను వీడియో గేమ్‌తో పోల్చి జవాన్లను అవమానిస్తారా..?

సర్జికల్ స్ట్రైక్స్‌ను వీడియో గేమ్‌తో పోల్చి జవాన్లను అవమానిస్తారా..?

కాంగ్రెస్ హయాంలో సర్జికల్ స్ట్రైక్స్ జరుగగా వాటిని వీడియో గేమ్స్‌తో పోల్చడం ప్రధానికి తగదని అన్నారు. వీడియోగేమ్స్ అని చెప్పి మోడీ భారత బలగాలను అవమానించారని అన్నారు. భారత బలగాలను రాజకీయాలకోసం వాడుకోమని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఆర్మీ మోడీ సొంత సొత్తు కాదని గుర్తుచేశారు. ఇక పెద్ద నోట్ల రద్దు చేసి ఎంతో మంది పేదల కష్టాలకు కారణమయ్యారని మోడీపై విమర్శలు గుప్పించారు రాహుల్ గాంధీ. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు తాము న్యాయ్ పద్ధతిని అవలంబిస్తామని చెప్పారు. పేద ప్రజలకు డబ్బులు అందగానే అది తమ అవసరాలకోసం మార్కెట్లో ఖర్చుచేస్తారని తద్వారా మరిన్ని ఉత్పత్తుల తయారీకి ఆస్కారం ఉంటుందని చెప్పిన గాంధీ ... ఇలా జరగడం వల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని అన్నారు.

 అనిల్ అంబానీ ఇంటికి తప్ప చర్చకు ఎక్కడికైనా వస్తా

అనిల్ అంబానీ ఇంటికి తప్ప చర్చకు ఎక్కడికైనా వస్తా

ప్రధానితో చర్చకు ఎక్కడికైనా వస్తాను అని ఒక్క అనిల్ అంబానీ ఇంటికి తప్ప అని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలపై, అవినీతిపూ చర్చించేందుకు తాను సిద్ధమని తనకు 10 నిమిషాల సమయం ఇస్తే మొత్తం తేల్చేస్తానని సవాల్ విసిరారు రాహుల్ గాంధీ.

English summary
Congress chief Rahul Gandhi today reiterated his challenge for a debate with Prime Minister Narendra Modi over what he called "fundamental issues" like jobs, economy and agriculture, two days before the country votes in the fifth phase of the national election. He also took a swipe at the BJP on the release of Pakistan-based terrorist Masood Azhar back in 1999.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X