వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంతవారే రాహుల్ కొంప ముంచారా..?ఎవరు ఈ ప్రవీణ్ చక్రవర్తి..?

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ సొంత తప్పిదాలతోనే అధికారంలోకి రాకుండా పోయిందా..అలా కాకుండా రాహుల్ గాంధీ నమ్మనివారే ఆయన్ను ముంచారా..? నమ్మిన బంట్లు కాంగ్రెస్ అధ్యక్షుడిని తప్పుదోవ పట్టించారా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులే ఆయనకు తప్పుడు సమాచారం చేరవేశారనే వార్త ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారింది.

కాంగ్రెస్ ఓటమికి కారణం ఎవరు..?

కాంగ్రెస్ ఓటమికి కారణం ఎవరు..?

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణం రాహుల్ గాంధీని కొందరు డైవర్ట్ చేయడం వల్లే జరిగిందని ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ 164 నుంచి 184 స్థానాలు ఒంటరిగా గెలుచుకుంటుందని చెప్పారట. ఇది నమ్మిన రాహుల్ గాంధీ పలు యూపీఏ మిత్రపక్ష పార్టీలను కలిశారట. వీరిలో స్టాలిన్, అఖిలేష్ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, శరద్ పవార్, తేజస్వీ యాదవ్‌లాంటి వారు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ రానున్న కొత్త కేబినెట్‌లో స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఇక ఎన్నికల్లో బీజేపీ ఓటమి తథ్యమని అప్పుడే నిర్ణయించుకుని గ్రాండ్ సెలబ్రేషన్స్‌కు కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. ఇక ఇంతా ప్లాన్ చేస్తే కాంగ్రెస్‌కు ఘోరపరాభవం తప్పలేదు. దీంతో రాహుల్ గాంధీ రాజీనామా చేయాల్సిన అవసరం ఉత్పన్నమైంది.

ఎవరీ ప్రవీణ్ చక్రవర్తి..?

ఎవరీ ప్రవీణ్ చక్రవర్తి..?

ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అత్యంత నమ్మిన వ్యక్తుల్లో ఒకరైన ప్రవీణ్ చక్రవర్తి జాడ కనిపించలేదు. ఆయనే కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ చూశారు. అంతేకాదు సమాచార విశ్లేషణ, శక్తి యాప్ వంటివి కూడా ప్రవీణ్ చక్రవర్తే దగ్గరుండి చూశారు. ఇక ఎన్నికలకు ముందు ఆయన సేకరించిన సమాచారం కలిగి ఉన్న హార్డ్ డిస్క్‌ను కూడా ఆయన ఇవ్వలేదు. వీటంతటికీ అయిన ఖర్చు రూ.24 కోట్లు బిల్లు సమర్పించారు తప్పనిస్తే అసలైన సమాచారం మాత్రం పొందుపర్చలేదు.మరోవైపు ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బీజేపీని 2014లో ఎలాగైతే అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారో... అదే తరహా పాత్రను కాంగ్రెస్‌కు ప్రవీణ్ చక్రవర్తి పోషించారు. అయితే ఈయన బీజేపీ కలుపు మొక్క అయి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కృషి చేశారని పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కార్యాలయంలో పనిచేసే ఎనిమిది మందిలో నలుగురు రాజీనామా చేశారు. చక్రవర్తి తర్వాత దివ్యస్పందన కూడా రూ.8 కోట్లు బిల్లు వేసింది.ఆమె కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. ఇలా చాలావారి ఎక్కువగా నమ్మి రాహుల్ గాంధీ మోసపోయినట్లు తెలుస్తోంది. ఇదే ఉచ్చులో సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీలు కూడా పడినట్లు తెలుస్తోంది.

184 మంది గెలుస్తారని జాబితా ఇచ్చిన ప్రవీణ్

184 మంది గెలుస్తారని జాబితా ఇచ్చిన ప్రవీణ్

మే 21న ప్రవీణ్ చక్రవర్తి రాహుల్ గాంధీని కలిసి 184 మంది గెలిచే వారి జాబితాను కూడా ఆయనకు సమర్పించినట్లు సమాచారం. 184 మంది కచ్చితంగా గెలుస్తున్నారని.. ఒకవేళ అటో ఇటో అయితే 164 సీట్లు కాంగ్రెస్‌కు కాకుండా ఎటూ వెళ్లవని చెప్పారట.ఇక వీరిలో 100 మంది తొలిసారిగా ఎంపీలు అవుతున్న వారి జాబితా సిద్ధం చేయమని అడిగారట. వారు పెద్దగా పరచయం లేనందున వారి జాబితా సిద్ధం చేయమని అడిగారట. అంతేకాదు ఓడిపోయే అవకాశం ఉన్నవారి జాబితాను కూడా తయారు చేయమని చెప్పినట్లు సమాచారం. రెండవ లిస్టులో మల్లికార్జున ఖర్గే, పవన్ భన్సల్, హరీష్ రావత్, అజయ్ మాకెన్‌లాంటి ప్రముఖుల పేర్లను ప్రవీణ్ చక్రవర్తి చేర్చినట్లు సమాచారం. అయితే వీరినే తన ప్రభుత్వంలో కేబినెట్‌‌లో ఉండాలని రాహుల్ గాంధీ కోరుకున్నట్లు సమాచారం. ఇక కౌంటింగ్‌కు ముందురోజు రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ తమ మిత్ర పక్ష పార్టీల అధినేతలకు ఫోన్లు చేశారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్‌లో మహాకూటమి గెలుస్తుందని కూడా చెప్పారు.

 ఫలితాలకంటే ముందు సీనియర్ లాయర్‌ను ఎందుకు కలిశారు

ఫలితాలకంటే ముందు సీనియర్ లాయర్‌ను ఎందుకు కలిశారు


ఇక ఫలితాలు వెలువడక ముందే తాము ప్రభుత్వంలోకి వస్తున్నామని తెలిసి రెండు ముసాయిదాలను తయారు చేయించేందుకు ఇద్దరు మాజీ కేంద్రమంత్రులతో పాటు రాహుల్ గాంధీ వ్యక్తిగత కార్యదర్శి కే. రాజులు ఒక సీనియర్ న్యాయవాది దగ్గరకు వెళ్లారట. ఒకటి ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్నామంటూ తెలుపుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఒక లేఖ.. రెండోది మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపే మరో లేఖను సిద్ధం చేయించారట.

మొత్తానికి రాహుల్ గాంధీని తన సొంతవారే పెడదోవ పట్టించి ఓటమి పాలయ్యేలా చేశారనే వార్త ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అంతేకాదు కొందరు నమ్ముకున్న ఓటర్లు కూడా కాంగ్రెస్‌కు వేయకుండా ఇతర పార్టీలకు వేయడం కూడా కాంగ్రెస్ ఓటమికి కారణంగా చెప్పుకుంటున్నారు.

English summary
There has been intense speculation regarding the reasons that forced Rahul Gandhi to resign as the Congress president, the foremost being that he was misled by his own team, and made to believe that his party was securing between 164 and 184 seats in the recent Parliamentary elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X