వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొందరగా కానివ్వండి... ఇప్పటికే చాలా ఆలస్యమైంది.. కొత్త ప్రెసిడెంట్ ఎంపికపై రాహుల్..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ ప్రెసిడెంట్‌గా కొనసాగలేనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ మరింత ఆలస్యం చేయకుండా వీలైనంత తొందరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పదవికి రాజీనామా చేసినందున కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియలో భాగం కాలేనని స్పష్టం చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే సస్పెషన్‌కు మోడీ ఆదేశాలుబీజేపీ ఎమ్మెల్యే సస్పెషన్‌కు మోడీ ఆదేశాలు

కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీదేనని రాహుల్ చెప్పారు. సీడబ్ల్యూసీ వీలైనంత తొందరగా సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ మే 25న అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇంకా ఆమోదించలేదు. పార్టీ సీనియర్లతో పాటు పలువురు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కోరారు. అయినా రాహుల్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.

Rahul says Congress Should Pick New Chief Without Delay

ఇదిలా ఉంటే రాహుల్ పదవిలో కొనసాగేందుకు ససేమిరా అంటుండటంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ త్వరలోనే భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్ నేతలు సైతం తమకు పార్టీ పగ్గాలు అప్పగించాలని పరోక్ష సంకేతాలు ఇస్తున్నందున సీడబ్యూసీ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దాదాపు నెలన్నర రోజులుగా రాహుల్ రాజీనామాపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధ్యక్ష పదవిలో ఆయనే కొనసాగాలంటూ పలువురు కార్యకర్తలు దీక్షలు సైతం చేపట్టారు. మరికొందరు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. రాహుల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలువురు నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు.

English summary
Rahul Gandhi today said his Congress party should choose a new president quickly and without further delay and that he was not part of the process at all as he had already resigned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X