వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ప్రెసిడెంట్‌‌‌ని హైకమాండ్‌ డిసైడ్ చేస్తుందన్న రాహుల్..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఎవరన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగే విషయంలో పునరాలోచనకు రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారు. పదవి నుంచి తప్పుకునే విషయంలో నిర్ణయం మార్చుకునే ప్రసక్తేలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశంపై స్పందించి రాహుల్ గాంధీ కొత్త ప్రెసిడెంట్ ఎవరన్నది కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేస్తుందని స్పష్టం చేశారు.

గుజరాత్ మాజీ ఐపీఎస్‌కు జీవిత ఖైదు : కస్టోడియల్ డెత్ కేస్లో కోర్టు తీర్పుగుజరాత్ మాజీ ఐపీఎస్‌కు జీవిత ఖైదు : కస్టోడియల్ డెత్ కేస్లో కోర్టు తీర్పు

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తన వారసున్ని ఎంపిక చేసే విషయంలో నిర్ణయాన్ని తానొక్కడినే తీసుకోలేనని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఎవరిని నియమించనున్నారంటూ విలేకరులు అడిగిన ప్రశ్నపై స్పందించిన ఆయన ఈ సమాధానం చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్‌దే తుది నిర్ణయమని రాహుల్ స్పష్టం చేశారు.

Rahul says Party will decide his successor

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం నేపథ్యంలో నైతిక బాధ్యతవహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని రాహుల్ నిర్ణయించారు. అయితే ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించింది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించాలని సూచించింది. అయితే రాహుల్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తేలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తదుపరి అధ్యక్ష రేసులో ఉన్నారంటూ పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే రాఫెల్ డీల్ విషయంలో తన వైఖరిలో ఎలాంటి మార్పులేదని రాహుల్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో రాఫెల్ అంశాన్ని ప్రస్తావించడంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాఫెల్ ఒప్పందంలో దోపిడి జరిగిందన్న వాదనకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఈ డీల్ విషయంలో సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ ఇప్పటికే చీఫ్ విజిలెన్స్ కమిషన్‌కు లేఖ రాసింది.

English summary
Congress president Rahul Gandhi on Thursday said his party will decide on who his successor will be and not him.He is not the person to take a decision on his successor, Gandhi told reporters when asked who will succeed him as Congress president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X