వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిపుల్ త‌లాక్ పై రాహుల్ సంచ‌ల‌నం! కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌స్తే ర‌ద్దు చేస్తామ‌ని వ్యాఖ్య‌!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Rahul Said That The Tripul Thalak Bill Would Be Canceled | Oneindia Telugu

ఢిల్లీ/ హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన త్రిపుల్ త‌లాక్ బిల్లుపై ఏఐసిసి రాహుల్ గాంధీ ఘాటు గా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వ‌స్తే ఈ బిల్లును ఉప‌సంహ‌రిస్తామ‌ని చెప్పారు. దేశం లో ఉన్న ఎంతో మంది ముస్లింల మ‌నోభావాల‌కు విరుద్దంగా బీజేపి ప్ర‌భుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింద‌ని విమ‌ర్శించారు. దేశంలోని పౌరులంద‌రిని స‌మానంగా చూసేంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే న‌ని ఆయ‌న అభివ‌ర్ణించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో దేశ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి ప‌ట్టం క‌ట్ట‌డం ఖాయ‌మని రాహుల్ గాంధీ ఆశాభావాన్ని వ్య‌క్తం చేసారు.

Rahul Sensational Comments on Triple Thalac..! If Congress comes to government it will be annulled .. !!

దేశంలో వ‌స్తున్న మార్పుల‌ను చూసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వణికిపోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యూపీయే మళ్ళీ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ బిల్లును ఉపసంహరిస్తామని చెప్పారు. మోదీని పరోక్షంగా ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ 56 అంగుళాల ఛాతీ వణికిపోతోందన్నారు. ఈ దేశం అందరిదీనని చెప్పారు. రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోందన్నారు. మోదీ చాలా నిరాశతో కనిపిస్తున్నారన్నారని, విద్వేషాన్ని వ్యాపింపజేయడం వల్ల మనుగడ ఉండదని ఆయనకు క‌నువిప్పు క‌లిగిన‌ట్టు ఉంద‌ని తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని రాహుల్ చెప్పుకొచ్చారు.

English summary
AICC Rahul Gandhi reacted strongly to the Triple Talak Bill, which has become a sensation across the country. The bill will be withdrawn if the Congress party comes into it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X