వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిట్లర్, కోతి వయా ప్రేమ : ఇదేనా కాంగ్రెస్ డిక్షనరీ.. రాహుల్, కాంగ్రెస్‌పై మోదీ ధ్వజం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మరో రెండు విడతల్లో పోలింగ్ ఉండగా .. ప్రధాని మోదీ రాహుల్, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనపై ప్రేమ ఉందని చెప్తుంటారు. కానీ ఆ పార్టీ నేతలు తనను అసభ్యపదజాలంతో దూషిస్తారు. కొందరు కోతి, తేలు, ఎలుక, పాము అని కామెంట్ చేస్తారని ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రేమ అని నిలదీశారు.

గౌరవించరా ?

గౌరవించరా ?

ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని గౌరవించడం కాంగ్రెస్ పార్టీలకు తేలియదని విమర్శించారు. మరికొందరు నియంతలు హిట్లర్, ముస్సోలిని అని సంభోదించడం కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిదర్శనమా అని అడిగారు. ఇది కాంగ్రెస్ పార్టీ సభ్యత, సంస్కరానికి ప్రతీక అని విమర్శించారు. బుధవారం ఆయన కురుక్షేత్రలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు.

హద్దులు దాటారు ?

హద్దులు దాటారు ?

ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తమ లిమిట్స్ దాటి ప్రవర్తించారు. ఒకానొక సందర్భంలో స్టుపిడ్ ప్రైమ్ మినిస్టర్ అని పిలువడం దేనికి సంకేతమని మోదీ ప్రజల దృష్టికి తీసుకెళ్లారు. ఓ వైపు రాహుల్ ప్రేమ అంటుంటే .. ఆ పార్టీకి చెందిన నేతలు ఇలా ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ డిక్షనరీలో ప్రేమ అంటే దూషించడమేనా అని మోదీ నిలదీశారు.

మోదీ వర్సెస్ రాహుల్

మోదీ వర్సెస్ రాహుల్

ఇటీవల రాజీవ్ గాంధీని బ్రష్టచారీ నంబర్ 1 అని మోదీ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనికి రాహుల్ కౌంటర్ ఇచ్చారు. 'యుద్ధం ముగిసింది, మీ కర్మ నీ కోసం ఎదురుచూస్తోంది, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం నా తండ్రిని దూషించడం సరికాదు. అయినా నాకు మీపై ప్రేమ ఉంది, మీకు గాఢ కౌగిలిని అందిస్తున్నా‘ అని రాహుల్ ట్వీట్ చేశారు. దీనికి మోదీ స్పందిస్తూ .. కాంగ్రెస్ ప్రేమ అంటే నిందించడమేనా అని విమర్శించారు.

English summary
Prime Minister Narendra Modi has hit out at Rahul Gandhi saying while he speaks of love, Congress leaders insult and abuse him by calling him "bandar", "chooha", "saanp" and "bichchu". Speaking at a rally in Kurukshetra, PM Modi on Wednesday said, "Some of their leaders call me Hitler, Mussolini while the others call me indecent, ill-mannered. Others call me rabies-infected monkey, rat, snake and scorpion." "So many times have they crossed all limits of decency by abusing me. This shows in their dictionary of love. They have called me a stupid Prime Minister, called me maut ka saudagar. This is how they show love," said PM Modi at the rally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X