వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి రమ్య నియోజకవర్గంపై రాహుల్‌గాంధీ ప్రత్యేక దృష్టి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలుపు కోసం ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఎన్నికల కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో ఏఐసిసి టీం పని చేస్తోంది. దేశవ్యాప్తంగా రాహుల్ టీం ముఖ్యంగా 70 లోకసభ నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టి సారించిందట. అందులో ప్రముఖ కన్నడ నటి రమ్య ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న మాండ్య నియోజకవర్గం కూడా ఉందట.

సమాచారం మేరకు రాహుల్ గాంధీ డెబ్బై నియోజకవర్గాల పైన ప్రత్యేక దృష్టి సారించారు. అందులో కర్నాటక రాష్ట్రంలో నాలుగు లోకసభ స్థానాలు ఉన్నాయి. అందులో రమ్య ప్రాతినిథ్యం వహిస్తున్న మాండ్య కూడా ఉంది. అలాగే బెంగళూరు దక్షిణ, బెంగళూరు ఉత్తర, బెంగళూరు సెంట్రల్‌ల పైన రాహుల్ టీం పని చేస్తోందట.

 Rahul team to keep eye on Mandya constituency

కాగా, లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ ఈ అంశంపై చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. బిజెపిలాగా మేము ఎన్నికలకు ముందు చౌకబారు రాజకీయాలు చేయడం లేదన్నారు.

మరోవైపు, భారత దేశ సెక్యులర్ వ్యవస్థ నాశనం కావడానికి, విద్వేషపూరిత నేరాలు చోటు చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న విచ్ఛిన్నకర విధానమే కారణమని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అరుణాచల్ ప్రదేశ్‌లో అన్నారు. కులం, ప్రాంతం, మతంతో సంబంధం లేకుండా ప్రజలందరినీ ఏకం చేయడం, వారి పురోగతికోసం కృషి చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమనమన్నారు.

English summary
Congress Vice-President Rahul Gandhi AICC team to keep eye on Ramya - Mandya LS constituency. According to the Party sources Rahul Gandhi has selected 70 constituencies to have a close look at the Party progress. Mandya is one among them. Also there are 3 other such constituencies in Karnataka. They are Bangalore South, Bangalore North and Bangalore Central.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X