వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహులే ప్రధాని : అన్ని అర్హతలు ఉన్నాయన్న తేజస్వి, రేసులో మమతా, మాయా

|
Google Oneindia TeluguNews

పాట్నా : మరో విడత సార్వత్రిక ఎన్నికల పోరు ఉండగానే .. గెలుపు, ప్రభుత్వం ఏర్పాటుపై ఆయా పార్టీలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే యూపీఏ చైర్ పర్సన్ భాగస్వామ్యపక్షాలతోపాటు .. మిగతా పార్టీ అధ్యక్షులకు లేఖ కూడా రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేశారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.

మహాకూటమిదే పీఠం ..
కేంద్రంలో మహాకూటమి ప్రభుత్వం కొలువుదీరుతుందని తేజస్వి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్డీఏకు ప్రజల చేతిలో చీత్కారం తప్పదని లెక్కగట్టారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అచ్చేదిన్ అని, బ్లాక్ మనీ వెనక్కి తీసుకొస్తామని కబుర్లు చెప్పిందని గుర్తుచేశారు. అధికారం చేపట్టి ఆ విషయాలనే మరచిపోయిందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. కేంద్రంలో మహాకూటమి ఏర్పడుతుందని .. ప్రభుత్వంలో రాహుల్ గాంధీ కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు. ప్రధాని పదవీ చేపట్టడానికి కావాల్సిన అన్ని అర్హతలు రాహుల్ గాంధీకి ఉన్నాయని తెలిపారు. ఇటు బీహర్ లో ఆర్జెడీ, కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు గెలుస్తుందని చెప్పారు. ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ఉత్తరప్రదేశ్ , బీహార్ కీ రోల్ పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.

rahul will be pm .. says tejasvi

రాహులే ప్రధాని
మహాకూటమిలో కాంగ్రెస్, ఆర్జీడీ కలిసి పోటీచేస్తోంది. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఆర్జేడీ అంగీకరిస్తుంటే మిగతా పక్షాలు ఒప్పుకొని పరిస్థితి ఏర్పడింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తాను ప్రధాని రేసులో ఉన్నానని సంకేతాలిస్తున్నారు. ఇప్పటికే మోదీ, అమిత్ షాతో కయ్యానికి కాలుదువ్వుుతున్న దీదీ, రాహుల్ కన్నా తనే మేలని చెప్పకనే చెబుతుంది. ఇక యూపీ నుంచి మాయావతి, అఖిలేశ్ కూడా ప్రధాని పోస్టుపై ఆశపెట్టుకున్నారు. యూపీకి చెందిన వ్యక్తే ప్రధాని పదవీ చేపడుతారని అఖిలేశ్ అంటున్నారు. అంటే మాయావతి, లేదంటే ఎస్పీ నుంచి అఖిలేశ్, ములాయం పేర్లు తెరపైకి వస్తాయో తెలియాలి. తానెమి తక్కవు లేదంటోంది మాయావతి. మోదీ ప్రధాని, సీఎంగా కూడా పనికిరాడని చెప్పడంలో ఆమె పీఎం పోస్ట్ పై కన్నెసినట్టు అర్థమవుతోంది. అయితే వీరిలో ఎవరు ప్రధాని అవుతారో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.
English summary
Another wave is close to the fight for the general elections. Already with the UPA Chairperson, the letter was written to the other party chairpersons. RJD leader Tejaswi Yadav has expressed his willingness to form the Mahatma Gandhi government in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X