వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ వ్యాప్తంగా రైల్ రోకో .. హర్యానా, పంజాబ్ ,యూపీలలో రైల్వే ట్రాక్ లపై పడుకుని రైతుల నిరసన

|
Google Oneindia TeluguNews

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు పంజాబ్, హర్యానా ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాలలో రైలు పట్టాలపై 'రైలు రోకో' నిరసన మొదలైంది . మధ్యాహ్నం ప్రారంభమైన ఈ ఆందోళన సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని, అయితే ఈ ఆందోళన శాంతియుతంగా ఉంటుందని రైతులు తెలిపారు. ఇప్పటికే రైతుల రైల్ రోకో నిరసనల నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో రైలు సర్వీసులు నిలిపివేయబడ్డాయి.

 రైతులు రైల్వే ట్రాక్ ల పై పడుకొని ఆందోళన

రైతులు రైల్వే ట్రాక్ ల పై పడుకొని ఆందోళన


ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వ రైల్వే పోలీసులను, రాష్ట్ర పోలీసులను మోహరించడంతో పంజాబ్, హర్యానాలో భద్రత కట్టుదిట్టం చేశారు.
ఉత్తర భారతదేశంలో పలు రైళ్లు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి . హర్యానా లో పలు ప్రాంతాల్లో రైళ్ళు ముందుకు కదలకుండా రైతులు రైల్వే ట్రాక్ ల పై పడుకొని ఆందోళన కొనసాగిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాలలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రైల్ రోకోలో పాల్గొని ఆందోళన చేస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు .

 శాంతియుతంగానే నిరసనలు ,రైల్ రోకోలు .. స్పష్టం చేసిన రైతులు

శాంతియుతంగానే నిరసనలు ,రైల్ రోకోలు .. స్పష్టం చేసిన రైతులు

ముఖ్యంగా రైల్వేశాఖ అప్రమత్తమై పలు చర్యలకు దిగింది ,ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు రైల్ రోకో నిర్వహిస్తామని , శాంతియుతంగానే రైళ్ళు నిలిపివేస్తామని చెప్పారు . అంతేకాదు నిలిచిన రైళ్లలో ప్రయాణికులకు ఆహారం ,నీటిని సరఫరా చేస్తున్నట్లు కూడా తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ రైల్ రోకో ఆందోళన నిర్వహిస్తున్నారు . సాగు చట్టాలను నిరసిస్తూ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు రోకో చేపట్టారు. అక్కడ నిర్వహించిన రైల్ రోకోలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తో పాటు వామపక్ష నేతలు పాల్గొన్నారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైల్వే శాఖ చర్యలు

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రైల్వే శాఖ చర్యలు

ఆందోళనలను శాంతియుతంగా జరపాలని ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ చెబుతున్నారు . అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పంజాబ్ , హర్యానా ,యూపీ, పశ్చిమ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలపై దృష్టి సారించామని పేర్కొన్నారు.

హర్యానాలో, సోనిపట్, అంబాలా మరియు జింద్ వద్ద రైలు స్టేషన్లు పూర్తిగా మూసివేయబడ్డాయి . రైల్వే అంబాలా, కురుక్షేత్ర, పానిపట్, పంచకుల మరియు ఫతేహాబాద్ (భట్టు కలాన్) జిల్లాల్లో నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వారిలో చాలామంది మహిళలు ఉన్నారు.

పంజాబ్ , హర్యానా , యూపీలలో ట్రాక్ లపైకి చేరిన నిరసనకారులు

పంజాబ్ , హర్యానా , యూపీలలో ట్రాక్ లపైకి చేరిన నిరసనకారులు

పంజాబ్‌లో ఢిల్లీ-లుధియానా-అమృత్ సర్ రైల్వే మార్గంలో పలు చోట్ల నిరసనకారులు ట్రాక్‌లపై కూర్చున్నారని అధికారులు తెలిపారు. జలంధర్ మరియు మొహాలి జిల్లాలలోని జలంధర్ కాంట్-జమ్మూ రైల్వే ట్రాక్‌ను రైతులు అడ్డుకున్నారు. రైతులను నిరసన తెలపడానికి పోలీసులు నిరాకరించడంతో బెంగళూరులో గందరగోళం నెలకొంది. "రైల్ రోకోను నిర్వహించడానికి పోలీసులు మాకు అనుమతి ఇవ్వడం లేదని వారు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

సాగు చట్టాల రద్దుకు ఉద్యమం ఉధృతం

సాగు చట్టాల రద్దుకు ఉద్యమం ఉధృతం


వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ కోసం ఒత్తిడి తెచ్చే సంయుక్త కిసాన్ మోర్చా - రైతు సంఘాల సమిష్టి నిర్ణయంగా గత వారం దేశవ్యాప్తంగా రైలు దిగ్బంధనాన్ని ప్రకటించింది. గత నవంబర్ నెల నుండి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు తమ ఆందోళన ఉధృతం చేయడంలో భాగంగా రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగిస్తున్నారు, దేశవ్యాప్తంగా నిరసనను చేపట్టడం తమ కొత్త వ్యూహంలో భాగమని చెప్పారు.

ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు జరిపినప్పటికీ వ్యవసాయ చట్టాలపై ప్రతిష్టంభన కొనసాగడంతో నిరసనను మరింత ఉధృతం చేస్తున్నారు రైతులు .

English summary
Farmers protesting against the Centre's new farm laws have gathered near rail tracks in parts of Punjab, Haryana Uttar Pradesh, Maharashtra and Karnataka for the ''rail roko'' protest. The agitation, which started at noon, will continue till 4 pm and will be peaceful, the farmers have said. Train services have been stopped in several areas as part of precautionary measure. Security has been tightened in Punjab and Haryana, with the deployment of the government railway police and the state police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X