వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగస్టు 12 వరకు అన్ని రైళ్లు బంద్.. అన్‌లాక్ 2.0 వేళ రైల్వే బోర్డు కీలక నిర్ణయం.. మరో షాకింగ్..

|
Google Oneindia TeluguNews

మరోసారి దేశవ్యాప్త లాక్ డౌన్ ఉండబోదని ప్రధాని మోదీ స్పష్టం చేసినప్పటికీ.. కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా ప్రజారవాణా వ్యవస్థ ఇప్పుడప్పుడే పున:ప్రారంభమయ్యేలా లేదు. ఇప్పటికే మూడు నెలలకు పైగా రైళ్లన్నీ స్తంభించిపోగా.. సర్వీసుల రద్దును ఆగస్టును 12 వరకూ పొడిగిస్తున్నట్లు రైల్వే బోర్డు గురువారం కీలక ప్రకటన చేసింది.

Recommended Video

Train Services Cancelled Till August 12, Railways Cancels All Tickets || Oneindia Telugu

 బిన్ లాడెన్‌పై భక్తి చాటుకున్న ఇమ్రాన్.. పాకిస్తాన్ పార్లమెంటులో భజన.. అమెరికాపై ఆగ్రహం.. బిన్ లాడెన్‌పై భక్తి చాటుకున్న ఇమ్రాన్.. పాకిస్తాన్ పార్లమెంటులో భజన.. అమెరికాపై ఆగ్రహం..

రఘురామ లేఖ తర్వాత బీజేపీ హైస్పీడ్.. నిమ్మగడ్డ భేటీతో లింకు.. సాయిరెడ్డి ఇరుకున పడ్డారా?రఘురామ లేఖ తర్వాత బీజేపీ హైస్పీడ్.. నిమ్మగడ్డ భేటీతో లింకు.. సాయిరెడ్డి ఇరుకున పడ్డారా?

ఆ 230 రైళ్లు తప్ప..

ఆ 230 రైళ్లు తప్ప..

వైరస వ్యాప్తి నానిటికీ పెరుగుతోన్న నేపథ్యంలో జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు అన్ని రెగ్యులర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. రెగ్యులర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు, మెయిల్ సర్వీసులు, ప్యాసింజరు రైళ్లు, సబర్బన్ రైళ్లను ఆగస్టు 12 వరకు నిలిపివేస్తున్నట్టు గురువారం వెల్లడించింది. కాగా, లాక్ డౌన్ సమయంలో తీసుకువచ్చిన 230 ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తాయని స్పష్టం చేసింది.

టికెట్టు రద్దు..

టికెట్టు రద్దు..

లాక్ డౌన్ సడలింపులు మొదలైనప్పటి నుంచీ రైల్వే సర్వీసుల విషయంలో గందరగోళం ఏర్పడుతూ రావడం తెలిసిందే. గతంలో పలు మార్లు.. ఫలానా రోజు నుంచి సర్వీసులు ప్రారంభిస్తామన్న బోర్డు.. ఆఖరి గంటల్లో నిర్ణయాన్ని మార్చుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకు ఆన్ లైన్ లో, స్టేషన్ల రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా బుకింగ్ చేసుకున్న టికెట్లన్నీ రద్దయిపోతాయని అధికారులు తెలిపారు. టికెట్లు పొందిన అందరికీ డబ్బులు వాపస్ ఇచ్చేస్తామని స్పష్టం చేశారు.

రోజుకో రికార్డు బద్దలు..

రోజుకో రికార్డు బద్దలు..

కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి భారత్ ప్రతిరోజూ తన రికార్డును తానే చెరిపేసుకుంటోన్న విషాదకర సందర్భమిది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం దాకా కొత్తగా 16,922 కేసులు వెలుగులోకి రాగా, 418 మంది చనిపోయారు. శుక్రవారం నాటికి కేసుల సంఖ్య 5లక్షలకు చేరనుంది. మొత్తం మరణాల సంఖ్య ఇప్పటికే 15వేల మార్కును దాటింది. జులై 1 నుంచి అన్ లాక్ 2.0 అమలులోకి రానున్నవేళ.. ఈసారి సడలింపులు భారీగా ఉండబోవనడానికి రైల్వే బోర్డు ప్రకటన సంకేతమిచ్చినట్లయింది.

డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ ప్రకటన..

డబ్ల్యూహెచ్‌వో షాకింగ్ ప్రకటన..

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1కోటికి పెరగగా, వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 5 లక్షలకు చేరువైంది. కరోనాకు రకరకాల మందులు వ్యాప్తిలోకి వచ్చినప్పటికీ అవేవీ సీరియస్ కేసుల్ని నయం చేసేవి కాకపోవడంతో పరిస్థితిలో మార్పురాలేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ‌హెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య మరింతగా పెరగొచ్చని చెప్పారు. కొన్ని దేశాలు లాక్ డౌన్ సడలింపులు ప్రకటిస్తూ రిలాక్స్ అవుతున్నాయని, అసలు సవాళ్లు రాబోయే రోజుల్లోనే ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
In the wake of coronavirus pandemic, all regular time-tabled passenger services, including Mail/Express trains, passenger and suburban services stand cancelled until 12 August, the Railway Board said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X