వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌కు మ‌ద్ద‌తుగా నినాదాలు...లోనోవాలాలో రైల్వే టీసీ అరెస్టు

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్‌కు మ‌ద్ద‌తుగా నినాదాలు చేసినందుకు గాను లోనోవాల‌కు చెందిన రైల్వే ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. అదేస‌మ‌యంలో ఉగ్ర‌వాదుల దాడిలో అమ‌రులైన జ‌వాన్ల‌కు అక్క‌డి స్థానికులు నివాళులు అర్పిస్తుండ‌గా ఈ వ్యక్తి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ గ‌ట్టిగా నినాదాలు చేశాడు.

ఓ వైపు ఉగ్ర‌దాడుల‌తో దేశమంతా క‌న్నీరు మున్నీరు అవుతోంది. దేశ‌వ్యాప్తంగా అమ‌రులైన జ‌వాన్ల‌కు నివాళులు అర్పించ‌డం జ‌రుగుతోంది. ఉపేంద‌ర్ కుమార్ బ‌హుదూర్ సింగ్ అనే వ్య‌క్తి రైల్వే టీసీగా ప‌నిచేస్తున్నాడు. లోనోవాలాలో ఉగ్ర‌వాదుల దాడిలో అమ‌రులైన జ‌వాన్ల‌కు నివాళులు అర్పిస్తున్న నేప‌థ్యంలో పాకిస్తాన్ జిందాబాద్ అని గ‌ట్టిగా నినాదాలు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయ‌న‌పై ప‌లు కేసులు న‌మోదు చేసి అరెస్టు చేశారు.

పుల్వామా ఉగ్రదాడిపై విషం చిమ్మిన పాక్ మీడియా... భారత్ ఉగ్రవాదం రంగు పులుముతోందంటూ రాతలుపుల్వామా ఉగ్రదాడిపై విషం చిమ్మిన పాక్ మీడియా... భారత్ ఉగ్రవాదం రంగు పులుముతోందంటూ రాతలు

Railway employee held for raising Pakistan Zindabad slogans

ప్ర‌జ‌లు శివాజీ చౌక్ ద‌గ్గ‌ర‌కు చేరుకుని నివాళులు అర్పిస్తున్న స‌మ‌యంలో పాకిస్తాన్‌కు మ‌ద్ద‌తుగా నినాదాలు చేయ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. బ‌హ‌దూర్ సింగ్‌కు దేహశుద్ధి చేసేందుకు ముందుకు అడుగువేశారు. అంత‌లోనే పోలీసులు వ‌చ్చి పెద్ద గొడ‌వ కాక‌ముందే సింగ్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారు.అరెస్టు చేసి కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా బ‌హ‌దూర్ సింగ్‌కు ఫిబ్ర‌వ‌రి 18వ‌ర‌కు కోర్టు రిమాండ్ విధించింది.

English summary
A railway employee was Friday arrested for allegedly raising 'Pakistan Zindabad' slogans at Lonavala in the district, where some local residents had gathered to pay homage to the CRPF jawans killed in Pulwama terror attack, a police official said.The man, Upendra Kumar Bahadur Singh (39), a junior ticket checker with the railways, was arrested under IPC section 153 (B) (imputations, assertions prejudicial to national integration), police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X