వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మృతుల కుటుంబాలకు రూ.3.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, యూపీ కూడా

యూపీలో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు జరిగిన పట్నా - ఇండోర్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలో మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది.

|
Google Oneindia TeluguNews

లక్నో: యూపీలో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు జరిగిన పట్నా - ఇండోర్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పిన ఘటనలో మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.3.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు, స్వల్పంగా గాయపడ్డ వారికి రూ.25వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు వెల్లడించారు.

కాగా, ప్రమాద స్థలంలో సహాయచర్యలు చేపట్టేందుకు వారణాసి, లక్నో నుంచి మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఒక్కో బృందంలో 45 మంది సిబ్బంది ఉన్నారు. దాదాపు 250 మంది పోలీసులు ప్రమాదస్థలి వద్ద రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి గల కారణాలను రైల్వే భద్రతా కమిషనర్‌ విచారిస్తున్నారని కేంద్రమంత్రి సురేష్ ప్రభు పేర్కొన్నారు.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 91కు చేరినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 150 మందికి పైగా గాయపడ్డారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.

English summary
Railway Minister Suresh Prabhu on Sunday announced an ex-gratia of Rs 3.5 lakhs each to the families of the deceased while Rs 50,000 for those critically injured in the Patna-Indore Express derailment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X