హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెరిగిన ప్లాట్‌ఫామ్ టికెట్ ధర, స్లీపర్ బోగీల్లో మహిళల కోటా పెంచారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్‌ను రూ. 5 నుంచి రూ. 10కి పెంచుతామన్న రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు అమలు ఏప్రిల్ 1 నుంచి రానున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. పెంపు ధరతో టికెట్లు ముద్రించాలని అన్ని ప్రాంతీయ రైల్వే కార్యాలయాలకు ఆదేశాలు పంపామని, అన్ని స్టేషన్లకు సకాలంలో వీటిని సరఫరా చేయాలని సూచించింది.

ఒకవేళ ఇంతకు ముందు ముద్రించిన టికెట్లు ఉంటే వాటిపై పెంచిన ధరతో కూడిన స్టాంప్ వేసి విక్రయించాలని పేర్కొంది. దీంతో పాటు అన్ని రైళ్లలోని స్లీపర్ బోగీల్లో మహిళల కోటాను పెంచుతూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఏసీ బోగీల విషయంలో ఈ రిజర్వేషన్ పెంపు విషయాన్ని ప్రస్తావించలేదు. రైల్వే బడ్జెట్ ప్రకటించిన మేరక సంబంధిత మంత్రి ఈ చర్యలు చేపట్టారు. ఈ మేరకు రైల్వే శాఖ అన్ని జోన్లకు ఒక లేఖను పంపింది.

Railway Platform Ticket to Cost Rs. 10 from April 1

ప్రస్తుతం స్లీపర్ క్లాసులో మహిళలు, వయోవృద్ధులు, గర్భిణులకు కోచ్‌కు రెండు చొప్పున కేటాయిస్తున్న బెర్త్‌ల సంఖ్యను నాలుగుకు పెంచాల్సిందిగా సూచనలు చేసింది. ఈ రిజర్వేషన్ తో పాటు వృద్ధులు, గర్భిణులు, వికలాంగుకు మధ్య పై బెర్త్‌లు కేటాయించిన తరుణంలో, వారు వచ్చి అభ్యర్ధించినప్పుడు ఖాళీగా ఉన్న కింది బెర్త్‌లను మొదటి అడిగిన వారికి మొదటి ప్రాధాన్యం కింద తప్పనిసరిగా కేటాయించాలని అధికారులు ఇప్పటికే టీటీఈలకు ఖచ్చితమైన సూచనలు జారీ చేశారు.

English summary
Railways has hiked the cost of platform tickets to Rs. 10 and the new rate will come into effect from next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X