వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పుడు ప్రచారం చేయొద్దు, రైల్వే దరఖాస్తు ఫీజును పెంచలేదు: పీయూష్‌

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగ నియామక పరీక్షలకు ఫీజును పెంచలేదని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. గతంలో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, తదితర కొన్ని వర్గాల అభ్యర్థులకు ఉచితంగా పరీక్షలకు అనుమతించేవారు. అలానే, జనరల్ కేటగిరి అభ్యర్థుల నుంచి రూ.100 వసూలు చేసేవారు.

రైల్వేలో 62వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: అప్లై చేయండిరైల్వేలో 62వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: అప్లై చేయండి

ఈ క్రమంలో ఫీజు లేకపోవడంతో చాలా మంది కేవలం దరఖాస్తు చేసి కనీసం పరీక్షకు కూడా హాజరు కావడం లేదని తాము గుర్తించామని, కాలక్షేపం కోసం కాకుండా వాస్తవంగా ఉద్యోగం కోరుకునువారే దరఖాస్తు చేసేలా చర్యలు తీసుకున్నామని గోయల్ చెప్పారు.

Railway recruitment examination fee to be refunded: Piyush Goyal

ఇందులో భాగంగానే గతంలో ఫీజు మినహాయింపు ఉన్న వర్గాల అభ్యర్థుల నుంచి ఈసారి రూ.250, జనరల్ అభ్యర్థుల నుంచి రూ.500 ఫీజు తొలుత వసూలు చేయాలని తాము నిర్ణయించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

ఆర్‌ఆర్‌బీలో 26వేల ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండిఆర్‌ఆర్‌బీలో 26వేల ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి

పరీక్షకు హాజరైన వారిలోని మినహాయింపు ఉన్న వర్గాలకు వారు కట్టిన మొత్తం ఫీజును, జనరల్ అభ్యర్థులకు రూ.400ను వెనక్కి ఇస్తామని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. అందు వల్ల ఇది ఫీజు పెంపు కిందకు రాదని, తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన సూచించారు.

English summary
Union Railway Minister Piyush Goyal on Wednesday said that fees for candidates appearing in the railway recruitment examination will be refunded once they appear for the examination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X