వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈసీ కొరడా: రైల్వే సిబ్బందిపై వేటు వేశారు...వీరు చేసిన తప్పేంటో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ఉత్తర్ ప్రదేశ్ : దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది ఎన్నికల సంఘం. ఇందులో భాగంగానే ఇద్దరు రైల్వే అధికారులను సస్పెండ్ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడికి మోడీ ఫోటో ఉన్న టికెట్‌ను ఇచ్చింది.

దీనిపై వివరణ ఇచ్చిన జిల్లా మెజిస్ట్రేట్... ఏప్రిల్ 13న రైల్వే స్టేషన్‌లో టికెట్లు ఇచ్చారని చెప్పారు. అయితే షిఫ్ట్ మారుతున్న సమయంలో పాత రైల్వే టికెట్‌కు సంబంధించిన రోల్‌నే వారు అమర్చి వెళ్లడంతో ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఉద్యోగులను ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

టికెట్లపై మోడీ ఫోటోలు ఉన్నాయని గతంలో ఈసీ దృష్టికి వచ్చిన వెంటనే వాటన్నిటినీ తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా కొన్ని చోట్ల యదేచ్చగా మోడీ ఫోటోలతో ఉన్న టికెట్లు దర్శనమిస్తున్నాయి. ఆదివారం మోడీ ఫోటోతో ఉన్న టికెట్ ఓ ప్రయాణికుడికి ఇచ్చింది సిబ్బంది. అందులో మోడీ సర్కార్ పథకం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం ప్రింట్ అయి ఉంది.

Railway staff suspended for issuing ticket with Modi Photo

మోడీ ఫోటోతో కూడిన టికెట్ తనకు ఇవ్వగానే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు టికెట్ తీసుకున్న ప్రయాణికుడు తెలిపాడుప. అయితే అతనిపై సిబ్బంది చిందులేసి అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా గదమాయించారని వెల్లడించాడు.ఇక చివరి ప్రయత్నంగా మీడియాను ఆశ్రయించి విషయాన్ని తెలియజేసినట్లు ఆ ప్రయాణికుడు చెప్పాడు. అయితే దీనిపై వివరణ ఇచ్చిన సూపర్‌వైజర్..

పొరపాటున పాత టికెట్ రోల్‌ను ప్రింటింగ్ మెషీన్‌లో సిబ్బంది ఉంచినట్లు చెప్పాడు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా రైల్వే స్టేషన్లలో రైళ్లలో ప్యాసింజర్లకు టీ కాఫీ విక్రయిస్తున్న వారు మోడీ ఫోటోతో కూడిన పేపర్ కప్పులను వాడుతున్నట్లు ప్రతిపక్షాలు ఈసీ దృష్టికి తీసుకొచ్చాయి. అంతేకాదు వాటిపై బీజేపీ నినాదం మైభీ చౌకీదార్ నినాదం ఉండటంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది.దీంతో రంగంలోకి దిగిన ఈసీ ఇది సప్లై చేసే కాంట్రాక్టర్‌పై రూ.లక్ష జరిమానా విధించింది.

English summary
Two railway officials were suspended on Monday (April 15), after passengers at Barabanki railway station in Uttar Pradesh were issued railway tickets with picture of PM Modi printed on it.In a statement to news agency ANI, the Additional District Magistrate said, "On 13 April, when the shift changed, the old roll was mistakenly used. Two employees are suspended, department probe are underway."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X