వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే కీలక నిర్ణయం.. జూన్ 30 వరకు అన్ని రెళ్ల బుకింగ్స్ రద్దు..

|
Google Oneindia TeluguNews

జూన్ 30 వరకు అన్ని రెగ్యులర్ రైళ్ల టికెట్ బుకింగ్స్‌ను రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఆ డబ్బులను తిరిగి చెల్లిస్తామని తెలిపింది. వలస కూలీలను తరలించేందుకు నడుపుతున్న శ్రామిక్ రైళ్లు,అలాగే స్పెషల్ ట్రైన్స్ మాత్రం యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది.

Recommended Video

Indian Railways Cancels all Regular Trains Till June 30, Waiting List Allowed

రైట్..రైట్ ..రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు: 50 శాతం మందితో జర్నీ.. ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్రైట్..రైట్ ..రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు: 50 శాతం మందితో జర్నీ.. ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్

మార్చి 25న లాక్ డౌన్ మొదలైన తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. అయితే జూన్‌లో రైళ్లను నడిపే ఉద్దేశంతో లాక్ డౌన్ పీరియడ్‌లో బుకింగ్స్‌కు రైల్వే అనుమతించింది. దీంతో వేల సంఖ్యలో ప్రయాణికులు బుకింగ్స్ చేసుకున్నారు. ఐఆర్‌సీటీసీ సైట్‌లో బుకింగ్ మొదలైన మొదటిరోజే 80వేల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవడంతో రైల్వేకు రూ.16కోట్లు ఆదాయం సమకూరింది.

Indian Railways cancels all regular train tickets for travel till June 30, special trains to continue

లాక్ డౌన్ 4.0 ఉంటుందని ప్రధాని మోదీ రెండు రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన వచ్చిన రెండు రోజులకే రైల్వే బుకింగ్స్‌ను రద్దు చేయడం గమనార్హం. మరోవైపు బుధవారం(మే 13)న రైల్వే బోర్డు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నడుస్తున్న స్పెషల్ ట్రైన్స్‌తో పాటు భవిష్యత్తులో నడిచే అన్ని రైళ్లకు వెయిటింగ్ లిస్టును ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది. దాని ప్రకారం ఏసీ3 టైర్‌లో 100 వరకు,ఏసీ 2టైర్‌లో 50వరకు,స్లీపర్ క్లాసులో 200 వరకు,చైర్ కార్స్‌లో 100 వరకు,ఫస్ట్ ఏసీ,ఎగ్జిక్యూటివ్ క్లాసులో 20వరకు వెయిటింగ్ లిస్టును అనుమతించనున్నారు.

English summary
Indian Railways has cancelled all regular train tickets booked for travel till June 30. The Indian Railways has announced that the trains have been cancelled and full refunds will be issued to all passengers who had booked tickets for travel in these special trains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X