వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూన్ 1 నుంచి రైల్వే టికెట్ బుకింగ్ కొత్త రూల్స్ ఇవే.. 30 రోజులకు పెరిగిన అడ్వాన్స్ బుకింగ్

|
Google Oneindia TeluguNews

జూన్ 1 నుంచి రోజుకు 200 రైళ్ల చొప్పున నడపాలని నిర్ణయించిన భారతీయ రైల్వే అందుకు అనుగుణంగా టికెట్ల రిజర్వేషన్ తో పాటు ప్రయాణ నిబంధనల్లోనూ పలు మార్పులు చేసింది. వీటి ప్రకారం ఇకపై ఏడు రోజులకు బదులుగా 30 రోజుల వరకూ టికెట్ రిజర్వేషన్ చేసుకునే వీలుంది. అలాగే ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ టికెట్లను కూడా జారీ చేయబోతోంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు జారీ చేసినా కన్ఫమ్ కాకపోతే వారికి ప్రయాణించేందుకు అవకాశం ఉండదని రైల్వే అధికారులు పేర్కొన్నారు.

railways extend advance ticket booking time upto 30 days

అలాగే, ఇప్పటి వరకు రైలు బయలుదేరడానికి అరగంట ముందు చార్ట్‌ విడుదల చేసేవారు. అయితే, ఇప్పుడు ఈ నిబంధనను కూడా మార్చింది. రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు మొదటి చార్ట్, రెండు గంటల ముందు రెండో చార్ట్‌ను విడుదల చేయనుంది. టికెట్లను ఇప్పటి వరకు ఐఆర్‌సీటీసీ, యాప్‌ల ద్వారా మాత్రమే బుక్ చేసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు రిజర్వేషన్ కౌంటర్లు, పోస్టాఫీసులు, ఐఆర్‌సీటీసీ అధీకృత ఏజెంట్ల నుంచి కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

Recommended Video

Indian Railways Extend Advance Ticket Booking Time Upto 30 Days

రేపటి నుంచే బుకింగ్స్.. తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల జాబితా ఇదే.. రేపటి నుంచే బుకింగ్స్.. తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్ల జాబితా ఇదే..

English summary
indian railways has made some changes in advanced ticket bookings for 30 ac trains running from june 1st. according to the latest rules, advancing booking time extended upto 30 days. and no passenger will be allowed with waiting list ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X