వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాణికులకు గుడ్‌న్యూస్: వన్ రైల్..వన్ హెల్ప్‌లైన్: విచారణ, ఫిర్యాదులకు సింగిల్ నంబర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నిత్యం రైళ్లల్లో రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సింగిల్ హెల్ప్‌లైన్ నంబర్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. వేర్వేరు సహాయాల కోసం ఇప్పటిదాకా వేర్వేరుగా హెల్ప్‌లైన్ నంబర్లు ఉండేవి. వాటన్నింటినీ ఏకీకృతం చేసింది. అన్ని రకాల విచారణలు/ఫిర్యాదులు/సహాయం కోసం ఒకే నంబర్ ఇక మీదట అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆ హెల్ప్‌లైన్ నంబర్. 139. ఈ నంబర్‌కు సగటున 3,44,513 ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు అందాయి. ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయడానికి లేదా విచారణ వివరాలను తెలుసుకోవడానికి స్మార్ట్‌ఫోనే అవసరం లేదు.

సోషల్ మీడియా ద్వారా

సోషల్ మీడియా ద్వారా

#OneRailOneHelpline139 హ్యాష్ ట్యాగ్‌తో ప్రత్యేకంగా సోషల్ మీడియా క్యాంపెయిన్‌ను సైతం రైల్వే అధికారులు చేపట్టారు. 139 నంబర్‌పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు. ఈ హెల్ప్‌లైన్ నంబర్ మొత్తం 12 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ప్రయాణ సమయంలో ఎదురయ్యే సమస్యలు ఎలాంటివైనా తమ వివరాలను తెలియజేస్తూ.. 139 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు లేదా ఎస్ఎంఎస్‌ను పంపించవచ్చు.

ఇలా డయల్..

ఇలా డయల్..

ఇప్పటిదాకా వేర్వేరు రకాల ఫిర్యాదుల కోసం అందుబాటులో ఉన్న నంబర్లు, వాటికి సంబంధించిన వ్యవస్థలన్నింటినీ ఏకీకృతం చేసింది. ఫలితంగా- ప్రయాణికులు మరింత వేగంగా ఫిర్యాదు చేయడానికి లేదా విచారణలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయదలిచిన ప్రయాణికులు ఇంటారిక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) లేక స్టార్ బటన్‌ ద్వారా డయల్ చేయడానికి వీలు కల్పించారు. దీనికోసం స్మార్ట్‌ఫోనే అవసరం లేదని వివరించారు. ఎలాంటి హ్యాండ్‌సెట్ ద్వారానైనా ఈ నంబర్‌కు డయల్ చేసే అవకాశం ఉంది.

సెక్యూరిటీ, మెడికల్ అసిస్టెన్స్ కోసం..

సెక్యూరిటీ, మెడికల్ అసిస్టెన్స్ కోసం..


ఈ నంబర్ ద్వారా సహాయం కోరదలిచిన ప్రయాణికులు 139 నంబర్‌ను డయల్ చేసిన అనంతరం ఐవీఆర్ఎస్ సూచించిన విధంగా తమ మొబైల్ ఫోన్లలో అంకెలను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. భద్రత లేదా వైద్య పరమైన సహాయం కోసం 1, పీఎన్ఆర్ స్టేటస్, రైళ్ల రాకపోకలు, బెర్త్ కర్ఫర్మేషన్, టికెట్ ధర, టికెట్ బుకింగ్, టికెట్ క్యాన్సలేసన్, వేకప్ అలారం, డెస్టినేషన్ అలర్ట్, వీల్ ఛైర్ బుకింగ్, భోజనాన్ని ఆర్డర్ చేయానికి సంబంధించిన వివరాల కోసం 2 నొక్కాల్సి ఉంటుంది. సాధారణ ఫిర్యాదుల కోసం 4, విజిలెన్స్ సంబంధిత ఫిర్యాదుల కోసం 5ను ప్రెస్ చేయాలి. పార్సెల్ అండ్ సరుకు రవాణాకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి 6, ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాల కోసం 7, తమ ఫిర్యాదులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి 9ని ప్రెస్ చేయాలని అధికారులు సూచించారు. నేరుగా కాల్ సెంటర్‌ సిబ్బందితో మాట్లాడటానికి స్టార్ బటన్‌ను నొక్కాలని అన్నారు.

English summary
The Helpline 139 will be available in twelve languages. Passengers can opt for IVRS (Interactive Voice Response System), or directly connect to the call-centre executive. There is no need for a smartphone to call on 139.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X