వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాత్రికన్ కృపయా ద్యాన్ దే: కొత్త హెల్ప్‌లైన్ నంబర్ 139, 12 భాషల్లో, ఎమర్జెన్సీ మాత్రం 182

|
Google Oneindia TeluguNews

ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త హెల్ప్‌లైన్ నంబర్‌ను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ఇదివరకు ఎక్కువ అంకెల్లో ఉండటం వల్ల ప్రయాణికులు తేలికగా గుర్తించుకోవడం సాధ్యపడలేదు. ప్యాసెంజర్స్ ఇబ్బందులను గమనించి హెల్ప్ లైన్ నంబర్ 139గా ప్రవేశపెడుతున్నట్టు రైల్వేశాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నది.

139కి కాల్ చేయండి

139కి కాల్ చేయండి

139కి కాల్ చేయడంతో తొందరగా సమస్య పరిష్కారమవుతోందని అధికారులు చెప్తున్నారు. ప్రయాణించే సమయంలో ప్రయాణికుల ఇబ్బందులు త్వరితగతిన సాల్వ్ అవుతాయని తెలిపారు. అయితే 182 నంబర్ మాత్రం అలానే ఉంటుందని, మిగతా అన్నీ నంబర్లు మాత్రం 139కి అనుసంధానం అవుతాయని సూచించారు. మూడంకెల నంబర్ కాబట్టి ప్యాసెంజర్స్ కూడా తేలికగా గుర్తుంచుకునే సౌకర్యం ఉంటుంది.

182 మాత్రం నో ఛేంజ్..

182 మాత్రం నో ఛేంజ్..

182 హెల్ప్ లైన్ నంబర్ మాత్రం రైల్వేశాఖ భద్రత కోసం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఆ నంబర్ మాత్రం యాధావిథిగా కొనసాగుతోందని తెలిపారు. 139 హెల్ప్ లైన్ నంబర్ మాత్రం 12 భాషల్లో ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా కనెక్ట్ అవుతోందని పేర్కొన్నారు. 139 నంబర్ కేవలం స్మార్ట్ ఫోనే కాదు.. అన్నీ నంబర్లకు కలుస్తోందని చెప్పారు.

కాల్ చేసి.. 1,2,3,

కాల్ చేసి.. 1,2,3,

భద్రత, వైద్యం కోసం ప్రయాణికులు 139 కాల్ చేసి 1 నొక్కాలని అధికారులు సూచించారు. వెంటనే కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్‌కు ఫోన్ కలిసి, సమస్యపై స్పందిస్తారని పేర్కొన్నారు. ఏదైనా సమస్య గురించి 2 నొక్కాలని, సమస్యకు సంబంధించి సబ్ మెను కూడా ఉంటాయని సూచించారు.

నంబర్ తీన్ దబాయే..

నంబర్ తీన్ దబాయే..

క్యాటరింగ్‌కు సంబంధించిన సమస్యల కోసం 3 ప్రెస్ చేయాలని, సాధారణ ఫిర్యాదుల కోసం 4, విజిలెన్స్ సంబంధించిన ఫిర్యాదుల కోసం 5, ప్రమాదాలకు సంబంధించిన విషయాల కోసం 6 నొక్కాలని పేర్కొన్నారు. కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే 9 నొక్కి యాష్ పట్టుకుంటే కాల్ సెంటర్ ప్రతినిధి అందుబాటులోకి వస్తారని తెలిపారు.

English summary
The Indian Railways has integrated its helpline numbers into a single number — 139 — for quick grievance redressal and enquiries by passengers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X