వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్ల కోటు, టై వద్దు, పీపీఈ మాస్క్, గ్లౌజ్ ముద్దు.. టికెట్ కలెక్టర్లకు రైల్వేశాఖ మార్గదర్శకాలు...

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ 4.0 సడలింపులతో జూన్ 1వ తేదీ నుంచి పట్టాలపైకి రైళ్లు ఎక్కనున్నాయి. అయితే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైల్వేశాఖ స్పష్టంచేసింది. ముఖ్యంగా టికెట్లను పరిశీలించే టికెట్ కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీచేసింది. వారు నల్లకోటు, టై కాకుండా పీపీపీ కిట్లు, మాస్క్ ధరించి, గ్లౌజ్ వేసుకోవాలని స్పష్టంచేసింది. ప్రయాణికుల టికెట్లను పరిశీలించే సమయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేసింది.

167 ఏళ్ల రైల్వే చరిత్రలో తొలిసారి ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. టికెట్ కలెక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. జూన్ 1వ తేదీ నుంచి 100 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. అయితే వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. టికెట్ కలెక్టర్లు కోట్, టై వేసుకోనున్నా.. వారి పేరుతో బ్యాడ్జీ ధరించే అవకాశం ఉంది.

Railways issues guidelines for TTEs: PPEs, masks, gloves on..

రైలు ప్రయాణించే సమయంలో సిబ్బంది అందరికీ మాస్క్, క్యాప్, గ్లోజ్, శానిటైజర్, సబ్బులు సరిపడ సంఖ్యలో రైలులో అందుబాటులో ఉంటాయని వివరించింది. ప్రయాణికుడి టికెట్‌ను దూరం నుంచే టికెట్ కలెక్టర్ చూడనున్నారు. అందుకోసం భూతద్దం లాంటి వస్తువును అందజేయనున్నారు. తొలుత 100 రైళ్లను నడుపుతామని.. పరిస్థితి బాగుంటే మరిన్ని రైళ్లను నడిపించేందుకు కేంద్రం యోచిస్తోంది.

Recommended Video

Railways Extends Advance Reservation Period From 30 Days To 120 Days

ప్రస్తుతం తిరుగుతున్న శ్రామిక్ రైళ్లలో బోగీలు అన్నీ నాన్ ఏసీవే. ప్రస్తుతం 100 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నందున.. పరిస్థితి బాగుంటే 1200 రైళ్లను తిప్పుతారు. ఈ రైళ్లలో ఏసీ బోగీలు కూడా ఉంటాయి. ఆన్ లైన్ కాకుండా ఆయా స్టేషన్లలో కూడా టికెట్లను ఇవ్వాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మరోవైపు స్టేషన్లలో ఫుడ్ స్టాల్స్, క్యాంటీన్లు తెరిచేందుకు కూడా అవకాశం కల్పించారు.

English summary
on-board ticket checking staff will now not be required to wear their customary black coats and ties and will instead wear gloves, masks, face shields, PPEs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X