హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల కోసం కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించిన రైల్వే శాఖ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రైలు ప్రయాణాన్ని సులభతరం చేస్తూ, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ టికెట్లను పొందేందుకు రైల్వే శాఖ ఒక సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను బుధవారం ప్రారంభించింది. ముంబైలోని సబర్బన్ రైల్వే సెక్టారులో పైలెట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదగా ప్రారంభించారు.

ఈ యాప్‌తో అన్‌రిజర్వ్‌డ్ రైలు టికెట్ కోసం ప్రయాణికులు ఇక గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా ముందుగా టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే అప్పటికప్పుడు ప్రయాణాలకు సిద్ధమైన ప్రయాణీకులు ఈ కొత్త మొబైల్ యాప్ ద్వారా సులభంగా టిక్కెట్లను పొందవచ్చు.

Railways Launches Mobile App for Paperless Ticketing of Unreserved Category

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాగిత రహిత టికెట్ సదుపాయం కోసం ఈ అప్లికేషన్‌ను రూపొందించినట్లు రైల్వే శాఖ అధికాలు తెలిపారు. రైలులో ఎక్కిన తర్వాత టీసీలకు మొబైల్‌లోని ఐడీ నెంబర్ చూసిప్తే సరిపోతుంది.

మొబైల్ యాప్‌ను ఈ లింక్ ద్వారా మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి

ఈ మొబైల్ అప్లికేషన్ ఎలా పనిచేస్తుంది?

స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైల్వే యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలి. రైల్వే ఇ-వాలెట్ కోసం వినియోగదారుడికి రిజిస్ట్రేషన్ ఐడీ నంబరు వస్తుంది. వినియోగదారుడు రిజిస్ట్రేషన్ చేయించుకొన్న తర్వాత వారి వివరాలు ఇ-వ్యాలెట్‌లో నమోదవుతాయి. టికెట్ల కొనుగోలు సొమ్మును ఇ-వాలెట్ మొబైల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

English summary
Rail commuters can now use a mobile phone App to obtain tickets in the unreserved category as the Indian railways takes forward its initiative for paperless ticketing from today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X