వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక రైళ్లు నడపడం వెనుక వ్యూహమిదేనా ? రైల్వే ప్లాన్ అదిరిందిగా....

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా వేల సంఖ్యలో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలా మందిని ఇప్పటికే ప్రభుత్వాలు గుర్తించి ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నాయి. అయితే ఇంకా ఎంతో మంది కోవిడ్ 19 బారిన పడిన వారు ఇంకా కరోనా ట్రేసింగ్ కు సహకరించడం లేదు. దీంతో ప్రభుత్వం తాజాగా నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో ప్రయాణికుల డేటాను తీసుకోవడం ద్వారా వారిపై నిఘా పెట్టాలని నిర్ణయించింది.

Recommended Video

Indian Railways Plan Behind Temporary Running Of Special Trains

ఏపీపైనా మహారాష్ట్ర ఎఫెక్ట్: తగ్గుముఖం పట్టని కరోనా: ఆ రెండు జిల్లాల్లో డేంజర్ బెల్స్ఏపీపైనా మహారాష్ట్ర ఎఫెక్ట్: తగ్గుముఖం పట్టని కరోనా: ఆ రెండు జిల్లాల్లో డేంజర్ బెల్స్

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని గుర్తించేందుకు రైల్వేశాఖ ప్రయాణికుల డేటా ను కూడా వాడుకోవాలని భావిస్తోంది. అందుకే ప్రస్తుతం ప్రత్యేక రైళ్లలో ప్రయాణిస్తున్న వారి డేటాను గమ్యస్ధానాల ఆధారంగా ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ నుంచి తీసుకుని భద్ర పరుస్తోంది. రేపు వీరిలో ఎవరికైనా కరోనా సోకినట్లు నిర్దారణ అయితే వారి కాంటాక్టులను సులభంగా గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ సమాచారాన్ని రైల్వేశాఖ సేకరిస్తోంది.

railways plan behind temporary running of special trains

మే 13 నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్లో ప్రత్యేక రైళ్లకు టికెట్లు బుక్ చేసుకుంటున్న స్వస్ధలాల్లో వారి అడ్రస్ లను తీసుకుంటోంది. వీటి ఆధారంగా భవిష్యత్తులో వీరిలో ఎవరైనా కరోనా బారిన పడినట్లు తేలితే అప్పుడు కాంటాక్టులను సులభంగా ట్రేస్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అందుకే ఇప్పటికే ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్లో ప్రయాణికుల అడ్రస్ తీసుకోవడాన్ని తప్పనిసరి చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించిన 12 మంది కరోనా బాధితులు ఉన్నట్లు తేలిందని అధికారులు తాజాగా వెల్లడించారు.

English summary
indian railways clarified that all special and sramik trains will be continued further. railways cancelled general ticket bookings for other passenger trains. and railways used the passenger destination details for covid 19 contact tracing also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X