వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

citizenship act: ఆందోళనకారుల విధ్వంసంతో రైల్వేకు భారీ నష్టం, ఎన్ని కోట్లంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దేశ రాజధాని న్యూఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో నిరసనకారులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఆందోళకారులు హింసకు, విధ్వంసానికి పాల్పడ్డారు.

 పౌరసత్వ చట్టంతో భారత ముస్లింలకు ఎలాంటి నష్టం లేదు: జామా మసీదు షాహీ ఇమామ్</a><a class=" title=" పౌరసత్వ చట్టంతో భారత ముస్లింలకు ఎలాంటి నష్టం లేదు: జామా మసీదు షాహీ ఇమామ్" /> పౌరసత్వ చట్టంతో భారత ముస్లింలకు ఎలాంటి నష్టం లేదు: జామా మసీదు షాహీ ఇమామ్

రైల్వేకు భారీగా ఆస్తి నష్టం..

ఆందోళనకారులు విధ్వంసం కారణంగా భారత రైల్వేకు రూ. 88 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఆందోళనకారులు చాలా చోట్ల రైల్వే స్టేషన్లకు నిప్పుపెట్టారు. రైల్వ ట్రాక్‌లను ధ్వం చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో రైల్వేకు తీవ్ర నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

కొనసాగిన విధ్వంసం

తూర్పు రైల్వే జోన్ పరిధిలో రూ. 72కోట్ల విలువ చేసే రైల్వే ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఇక ఆగ్నేయ రైల్వే జోన్‌లో రూ. 13కోట్లు, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ జోన్‌లో రూ. 3 కోట్ల ఆస్తులు ధ్వంసం చేశారు ఆందోళనకారులు. ఈ మేరకు రైల్వే అధికారులు తెలిపారు.

పశ్చిమెంగాల్‌లోనే ఎక్కువగా..

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో విధ్వంసానికి మమతా బెనర్జీ మద్దతు పలుకుతున్నారంటూ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం అస్సాంతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కూడా కొంతమేర పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అస్సాంలో ఆందోళనలు సద్దుమణగడంతో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మేఘాలయలో మొబైల్ ఇంటర్నెట్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. దేశ రాజధానిలోనే ఆందోళనలు శనివారం కూడా కొనసాగుతున్నాయి.

కోట్ల నష్టం..

జామియా మిలీయా యూనివర్సిటీ విద్యార్థులు శనివారం కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్ సహా, ఇతర విపక్షాలు కూడా ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు. ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో దేశ రాజధానిలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కూడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

English summary
The Indian Railways declared on Saturday that properties worth Rs 88 crore was damaged in the protests against the Citizenship Amendment act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X