వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే ప్రయాణికులకు తీపి కబురు: ఫ్లెక్సీ ఫేర్ రద్దు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. కేవలం థర్డ్ ఏసీ బోగీలు కలిగి ఉండే హమ్ సఫర్ రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ ధరలో ఉన్నత ప్రమాణాలు కలిగిన సదుపాయాలను ప్రజలకు అందించాలన్న ప్రభుత్వం సంకల్పానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

 Railways removes flexi-fare scheme from Humsafar trains

Recommended Video

IRCTC’s New Feature : Check Vacant Train Seats, Reservation Chart Online | Oneindia Telugu

త్వరలో హమ్ సఫర్ రైళ్లలో థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్ బోగీలను కూడా జత చేయనున్నట్లు రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. అంతేగాక, ఈ రైళ్లకు సంబంధించిన తత్కాల్ టికెట్ ఛార్జీలను కూడా తగ్గించినట్లు ప్రకటించారు.

ప్రస్తుత థర్డ్ ఏసీ సాధారణ రైళ్లలో ఉండే ఛార్జీలకు 1.5 రేట్లు అదనంగా ఉండగా.. ఇప్పుడు 1.3రేట్లకు తగ్గించింది. కాగా, 2016 డిసెంబర్ నుంచి హమ్ సఫర్ రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. అత్యాధునిక సదుపాయాలతోపాటు కూడిన థర్డ్ ఏసీ బోగీలు కలిగిన ఈ రైళ్లు దేశ వ్యాప్తంగా 70 వరకు సేవలందిస్తున్నాయి.

English summary
In a big relief to passengers, railways has removed the flexi-fare scheme from its premium Humsafar trains and has also decided to introduce sleeper class coaches, a senior official said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X