వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా కంపెనీల నెత్తిన భారత్ పిడుగు: ట్రేడ్ వార్: రూ.471 కోట్ల రైల్వే కాంట్రాక్టు పనులు రద్దు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనాతో ట్రేడ్ వార్‌ను ఆరంభించినట్టే కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మొదట భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు సంబంధించిన 5జీ అప్‌గ్రేడ్ ప్రాజెక్టులో చైనా కంపెనీలకు చెక్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా రైల్వే కాంట్రాక్టు పనుల్లోనూ కోత పెట్టింది. చైనా కంపెనీకి అప్పగించిన రైళ్ల సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ల కాంట్రాక్టు పనులను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ కాంట్రాక్టు పనుల విలువ 471 కోట్ల రూపాయలు.

ట్రేడ్ వార్‌కు శ్రీకారం చుట్టినట్టే..

ట్రేడ్ వార్‌కు శ్రీకారం చుట్టినట్టే..


లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద భారత జవాన్లపై చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్) బలగాల ఆటవిక దాడి చోటు చేసుకున్న రెండు రోజుల వ్యవధిలో భారత్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. చైనా బలగాల దాడిలో భారత్‌కు చెందిన కల్నల్ ర్యాంకు కమాండింగ్ అధికారి బిక్కుమల్ల సంతోష్‌బాబు సహా 20 మంది వీరమరణం పొందారు. వారి త్యాగాలను వృధా కానివ్వబోమంటూ అటు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ట్రేడ్‌వార్‌కు దిగినట్లు కనిపిస్తోంది.

ఫ్రైట్ కారిడార్ కాంట్రాక్టు పనులు రద్దు..

ఫ్రైట్ కారిడార్ కాంట్రాక్టు పనులు రద్దు..


మనదేశంలో గూడ్స్ రైళ్ల రాకపోకల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా కారిడార్‌ను నిర్మిస్తోంది. దీనికోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. ఎలాంటి ఆటంకం లేకుండా గూడ్స్ రైళ్ల రాకపోకలను కొనసాగించడం, తద్వారా సరుకుల చేరవేతలో వేగాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రత్యేక కారిడార్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కాన్పూర్-దీన్ దయాళ్ ఉపాధ్యయ సెక్షన్ మధ్య సిగ్నళ్లు, టెలికమ్యూనికేషన్ల వ్యవస్థను నెలకొల్పే ప్రాజెక్టు పనులను ఈ సంస్థ చైనా కంపెనీకి అప్పగించింది.

బీజింగ్ రైల్వే రీసెర్చ్ సంస్థకు సడన్ షాక్..

బీజింగ్ రైల్వే రీసెర్చ్ సంస్థకు సడన్ షాక్..

బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ గ్రూప్ కంపెనీ ఈ పనులను దక్కించుకుంది. కాన్పూర్-దీన్ దయాళ్ ఉపాధ్యాయ సెక్షన్ మధ్య దూరం 471 కిలోమీటర్లు. ఈ మార్గం పొడవునా సిగ్నళ్లు, కమ్యూనికేషన్ల వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత బీజింగ్ నేషనల్ రైల్వే సంస్థది. ఈ ప్రాజెక్టు విలువ 471 కోట్ల రూపాయలు. 2016 జూన్‌లో దీనికి సంబంధించిన కాంట్రాక్టు పనులను బీజింగ్ సంస్థకు అప్పగించారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి.

Recommended Video

#IndiaChinaFaceOff : Colonel Santosh Babu's Last Rites
నాలుగేళ్ల వ్యవధిలో 20 శాతమే ప్రోగ్రెస్

నాలుగేళ్ల వ్యవధిలో 20 శాతమే ప్రోగ్రెస్

తాజాగా బీజింగ్ నేషనల్ రైల్వే సంస్థకు అప్పగించిన కాంట్రాక్టు పనులను రద్దు చేస్తున్నట్లు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ గురువారం మధ్యాహ్నం ప్రకటించింది. దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. కాంట్రాక్టు పనులను పొందిన ఈ నాలుగేళ్ల కాలంలో బీజిగ్ సంస్థ ఆశించిన స్థాయిలో పనుల్లో పురోగతిని సాధించలేకపోయిందని ఫ్రైట్ కారిడార్ సంస్థ అధికారులు వెల్లడించారు. నాలుగేళ్ల వ్యవధిలో 20 శాతంమాత్రమే పనులను పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఆశించిన స్థాయిలో వేగం లేకపోవడం వల్ల బీజింగ్ సంస్థకు కేటాయించిన కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

English summary
In view of poor progress, it is decided by Dedicated Freight Corridor Corporation of India (DFCCIL) to terminate the contract with Beijing National Railway Research and Design Institute of Signal and Communication Group Co. Ltd.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X