వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైళ్లలో నో మసాజ్ .. ప్రతిపాదనపై వెనక్కితగ్గిన రైల్వేశాఖ .. కారణమిదే ..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థ మసాజ్ ప్రవేశపెడతామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంటా బయట విమర్శలు రావడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. రైళ్లలో ప్రయాణికుల మసాజ్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను వెనక్కితీసుకుంటున్నట్టు శనివారం రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Railways withdraws massage services on trains

ఆదాయం కోసం ..
ప్రయాణికుల కోసం కొన్ని రైళ్లలో ప్రయోగాత్మకంగా మసాజ్ ప్రవేశపెడతామని ఈ నెల 8న రైల్వేశాఖ తెలిపింది. కొన్నిరోజుల్లో ఇండోర్ నుంచి బయల్దేరే 39 రైళ్లలో ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ సిబ్బంది ప్రయాణికులకు తల, మెడ, కాళ్లకు మసాజ్ చేస్తారని పేర్కొన్నది. దీంతో ఈశ్చిమ రైల్వేకు అదనంగా రూ.20 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. అంతేకాదు టికెట్ల అదనంగా బుక్ చేసుకునేవారితో రైల్వేకు రూ.90 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. దాదాపు 20 వేల అదనంగా టికెట్లు కొను202గోలు చేస్తారని లెక్కట్టింది.

విమర్శలతో ..
కానీ రైళ్లలో మసాజ్‌ ప్రవేశపెట్టడాన్ని సొంత పార్టీ నుంచి విమర్శలు వచ్ాచయి. ఇండోర్ ఎంపీ శంకర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖకు లేఖ కూడా రాశారు. ఇది భారతీయ సంస్కృతికి విరుధ్దమని .. అలాంటి మసాజ్ మహిళల ముందు చేయడం సరికాదని లేఖలో పేర్కొన్నారు. రైళ్లలో ఆదాయం సమాకూర్చుకునేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఓకే కానీ ... మసాజ్ మాత్రం సరికాదని సూచించారు. అంతేకాదు శతాబ్ధి, రాజధాని తప్పితే మిగతా రైళ్లలో 4 గంటల ప్రయాణం కోసం ఏ ప్రయాణికుడు మసాజ్ కావాలని కోరుకుంటారని ప్రశ్నించారు. దీనిపై మహిళల నుంచి నిరసన వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైల్వేశాఖ 3 క్యాటగిరీలుగా మసాజ్‌ను విభజించింది. గోల్డ్, డైమండ్, ప్లాటినం అని పేర్కొంది. గోల్డ్ విభాగంలో ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తారు. ఇందుకు రూ.100 చార్జీ చేస్తారు. డైమండ్ సర్వీస్‌లో రూ.200 చార్జీ చేస్తారు. ప్లాటినం ప్యాకేజీలో రూ.300 వసూల్ చేస్తారు. ఈ మూడు విభాగాల్లో ప్రయాణికులకు ఇరవై నిమిషాల పాటు మసాజ్ చేస్తామని అంతకుముందు ప్రకటించారు. అయితే అన్నిపక్షాల నుంచి నిరసనలు రావడంతో .. ఈ ప్రతిపాదనపై రైల్వేశాఖ వెనక్కి తగ్గింది.

English summary
Facing criticism, the Rail Ministry has decided to withdraw the proposal of providing head, neck and foot massages to passengers on trains Saturday. A railway official had said on June 8 that the railways was readying to begin the facility in the next couple of weeks in 39 trains departing from Indore. This is a proposal from the Ratlam division of Western Railway zone, an official said. The railways is looking to earn an additional revenue of Rs 20 lakh annually and an estimated increase of Rs 90 lakh per year through additional sale of tickets from about 20,000 passenger who will be the service providers, PTI had reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X